వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీడీ బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం, బడ్జెట్ అంచనా ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

టీటీడీ 2020-2021 బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ.3309 కోట్లతో బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నది. గతేడాది బడ్జెట్ రూ.3249 కోట్లు కాగా.. ఈ సారి రూ.60 కోట్ల అంచనాలు పెరిగాయి. హుండీ ద్వారా రూ.1351 కోట్లు, వడ్డీల ద్వారా రూ.706 కోట్లు, లడ్డూ విక్రయాల ద్వారా రూ.400 కోట్ల ఆదాయం వస్తోందని పాలకవర్గం లెక్కగట్టింది.

బడ్జెట్‌ అంచనాలతోపాటు 165 అంశాలపై కూడా టీటీడీ చర్చించింది. గరుడ వారధి, స్విమ్స్ హాస్పిటల్ నిధుల కేటాయింపు, లడ్డూల విక్రయంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. బడ్జెట్‌లో గరుడ వారధికి రూ. 100 కోట్లు, స్విమ్స్ ఆస్పత్రికి రూ.100 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.

TTD approves budget of ₹3309 crore for 2020-21

వీటితోపాటు ఫైనాన్షియల్ సబ్ కమిటీ చేసిన సూచనలను కూడా పాలకవర్గం చర్చించింది. టీటీడీలో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఇప్పటికే సబ్ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, ఆదాయం పెంపు మార్గాలపై కూడా డిస్కష్ చేశారు.

English summary
Tirumala tirupati devasthanam approves budget of ₹3309 crore for 2020-21 year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X