వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఛాలెంజ్‌: ద‌మ్ముంటే బోర్డును ర‌ద్దు చేసుకోండి..టీటీడీ బోర్డు స‌మావేశం ర‌సాభ‌సా

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్న జ‌గ‌న్‌ను తొలి రాజ‌కీయ ఛాలెంజ్. అది కూడా ప్ర‌ఖ్యాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ఛైర్మ‌న్ చేసిన స‌వాల్‌. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత తొలి సారిగా బోర్డు ఏర్పాటు చేసిన స‌మావేశం ర‌సాభాస‌గా మారింది. బోర్డు స‌భ్యుల అనుచిత వ్యాఖ్య‌ల‌తో అధికారులు స‌మావేశం నుండి అర్దాంతరంగా బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. ఇదే స‌మ‌యంలో ఛైర్మ‌న్ సుధాక‌ర్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టించాయి.

టీటీడీ బోర్డు స‌మావేశం ర‌సాభాస‌..
టీటీడీ పాలకమండలి సమావేశం ర‌సాభాస‌గా సాగింది. . అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవో సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు బయటకు వెళ్లిపోయారు. అధికారులు తొలుత స‌మావేశానికి హాజ‌రు కాలేదు. అయితే బోర్డు నియ‌మావ‌ళి చెప్పేందుకు వారు స‌మావేశానికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు బోర్డు స‌భ్యులు అధికారుల మీద అనుచిత వ్యాఖ్య‌లు చేసారు. దీంతో..సమావేశాన్ని కార్యనిర్వహణాదికారి సింఘాల్, జెఈఓ శ్రీ్నివాసరాజు లు బహిష్కరించారు. ఆ త‌రువాత కొద్ది సేపు స‌మావేశ‌మైన బోర్డు అర్దాంతరంగా ముగిచేసింది. ఇదే స‌మ‌యంలో టీటీడీ బోర్డు సభ్యుడు చల్లా బాబు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఈవో సింఘాల్‌కు చల్లా బాబు అందజేశారు. అయితే, ప్ర‌భుత్వం మారితే బోర్డు సైతం రాజీనామా చేయాల్సి ఉంటుంద‌ని..ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న టీటీడీ బోర్డు ను ర‌ద్దు చేయ‌టం స‌మంజ‌సం కాద‌ని..బోర్డు త‌నంత‌ట తానుగా రాజీనామా చేయాల్సి ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు.

TTD board meeting concluded in dispute between members and officers..decided to not resign.

ప్ర‌భుత్వానికి ఛైర్మ‌న్ స‌వాల్‌..
తిరుమలతిరుతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న టిడిపి నేత పుట్టా సుధాకర్ యాదవ్ తాము స్వచ్చందంగా రాజీనామా చేయబోమని ప్రకటించారు. కావాలంటే ప్రభుత్వం రద్దు చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తమను ప్రభుత్వమే నియమించిందని.. అదికారులు సమావేశానికి రాలేదని అన్నారు.టిటిడి అదికారులు సమావేశాన్ని బహిష్కరించారని ,వారి కోసం వేచి చూశామని ఆయన అన్నారు. అయితే, తిరుమ‌లకు ఉన్న ప‌విత్ర‌త దృష్ట్యా అక్క‌డ కొన‌సాగుతున్న బోర్డును ప్ర‌భుత్వం సాధార‌ణంగా ర‌ద్దు చేయ‌దు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఉండాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం మారితే అప్పటి వ‌ర‌కు ఉన్న బోర్డు స్వ‌చ్చందంగా వైదొలుగుతుంది. 2014లో అప్ప‌టికే కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో టీటీడీ ఛైర్మ‌న్‌గా క‌నుమూరి బాపిరాజుకు అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌భుత్వం మారే స‌మ‌యానికి బాపిరాజు ఛైర్మ‌న్‌గా కొన‌సాగుతున్న బోర్డు..కొద్ది రోజుల త‌రువాత వారే రాజీనామా చేసారు. ఇక‌, ఇప్పుడు ఛైర్మ‌న్ సుధాక‌ర్ యాద‌వ్ చెబుతున్న విష‌యంలో కొత్త ప్ర‌భుత్వం ఏ ర‌కంగా స్పందిస్తుందో చూడాలి.

English summary
TTD board meeting concluded in dispute between members and officers. Board Chairman Sudhakar Yadav says they will not resign till the new Govt take decision on cancel the board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X