తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ మాట అనలేదు... జగన్ భక్తి విశ్వాసాలకు అదే నిదర్శనం... తిరుమల డిక్లరేషన్ వివాదంపై వైవీ...

|
Google Oneindia TeluguNews

తిరుమలలో అన్య మతస్తుల డిక్లరేషన్‌కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అనలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ వివిధ మతాలకు చెందిన వేలాదిమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారని... వారందరినీ తప్పనిసరిగా డిక్లరేషన్ కోరలేము కదా అని మాత్రమే అన్నానని చెప్పారు. ఒక సెక్షన్ మీడియా ఉద్దేశపూర్వకంగా తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తోందన్నారు. తాజా వివాదంపై శనివారం శ్రీవారి ఆలయం ఎదుట వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

అంతే తప్ప మరో ఉద్దేశం లేదు...

అంతే తప్ప మరో ఉద్దేశం లేదు...

గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, దివంగ‌త సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్వామి వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ని మాత్ర‌మే చెప్పానన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్పానని తెలిపారు. అంతే తప్ప,మరో ఉద్దేశం లేదని... డిక్లరేషన్ పూర్తిగా తీసేయాలని తాను ఎక్కడా అనలేదని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ అనవసర వివాదాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

అంతకంటే ఆధారాలు అవసరం లేదు...

అంతకంటే ఆధారాలు అవసరం లేదు...


సీఎం వైఎస్‌ జగన్‌ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న తర్వాతే పాద‌యాత్రను ప్రారంభించారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆ తర్వాత తిరుప‌తి నుంచి కాలిన‌డ‌క‌న వ‌చ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుని ఇంటికి వెళ్లారన్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్న తర్వాతే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారని గుర్తుచేశారు. తిరుమల శ్రీవారి మీద జగన్‌కు అపార‌మైన భ‌క్తి విశ్వాసాలు ఉన్నాయ‌ని చెప్పేందుకు ఇంత‌కంటే ఆధారాలు అవ‌స‌రం లేదన్నారు. అందువ‌ల్లే ఆయన స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని చెప్పానని... అంతే త‌ప్ప డిక్ల‌రేష‌న్ తీసేయాల‌ని ఎక్కడా చెప్పలేదన్నారు.

టీటీడీ రూల్స్ ఏం చెప్తున్నాయి..

టీటీడీ రూల్స్ ఏం చెప్తున్నాయి..


టీటీడీ చ‌ట్టంలోని రూల్ 136 ప్ర‌కారం శ్రీవారి దర్శనానికి హిందువులు మాత్ర‌మే అర్హులు. ఒకవేళ అన్య మతస్తులు స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోవాలంటే తాము హిందూయేత‌రుల‌మ‌ని దేవ‌స్థానం అధికారుల‌కు చెప్పి సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. టీటీడీ చట్టం రూల్ 137లో ఈ వివరాలు స్పష్టంగా పొందుపరిచారు. 2014లో ప్ర‌భుత్వం జారీ చేసిన మెమో ప్ర‌కారం... ఎవ‌రైనా గుర్తించద‌గిన ఆధారాలు ఉన్న‌వారైతే (ఉదాహ‌ర‌ణ‌కు ఏస‌య్య‌, అహ్మ‌ద్‌, స‌ర్దార్ సింగ్ ఇలాంటి ఇత‌ర‌త్రా పేర్లు లేదా వారి శ‌రీరం మీద ఇత‌ర మతాల‌కు సంబంధించిన గుర్తులు ఉంటే) దేవ‌స్థానం అధికారులే డిక్ల‌రేష‌న్ అడుగుతారు. అయితే గ‌తంలో అనేక‌మంది ఇత‌ర మ‌తాల‌కు చెందిన రాజ‌కీయ‌, అధికార ప్ర‌ముఖులు స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన సంద‌ర్భంలో డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేదు.

Recommended Video

Sadineni Yamini పై కేసు వేసిన TTD అధికారులు.. కారణం ఇదే!!
వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా..?

వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా..?

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 23న స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించనున్నారు. తిరుమలకు విచ్చేయనున్న జగన్‌ను డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. అయితే తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదని ఆయన వివరణ ఇచ్చుకోవడంతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా... లేక ప్రతిపక్ష నేతల నుంచి దాడి కొనసాగుతుందా అన్నది చూడాలి.

English summary
I never said there is no need of self declaration from other religion people who wants to visit Tirumala,said TTD chairman YV Subbareddy after the controversy arise on his comments.He held a press meet in tirumala on Saturday evening to give clarity about his comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X