• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ముగిసిన చదలవాడ పదవీకాలం, మరో టర్మ్ పొడిగింపు లేనట్టేనా? కారణమిదే!

By Narsimha
|

తిరుపతి: టీటీడి ఛైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తతో పాటు పాలకవర్గం పదవీ కాలం పూరై్ంది.అయితే కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వాన్ని నియమించే అవకాశం ఉంది.అయితే ప్రస్తుతమున్న ఛైర్మెన్ చదలవాడనే కొనసాగించే అవకాశాలు లేవంటున్నాయి పార్టీ వర్గాలు. మరో వైపు రెండేళ్ళపాటు చదలవాడ నేతృత్వంలోని పాలకవర్గం అధికారులు తీసుకొన్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసేందుకే మొగ్గుచూపిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.అయితే చదలావాడకు మరోసారి పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నుండి పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో టిడిపి ఛైర్మెన్ పదవిని ఇస్తామని చదలవాడకు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు చదలవాడకు టీటీడి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు.

తొలుత ఏడాదిపాటు మాత్రం ఈ పదవి ఉంటుందని భావించినా మరో ఏడాదిపాటు ఈ పదవిని పొడిగించారు. రెండేళ్ళపాటు చదలవాడ నేతృత్వంలోని పాలకవర్గం కొనసాగింది.

చదలవాడకు మరోసారి అవకాశాన్ని పొడిగించే అవకాశాలు ఉండకపోవచ్చని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.దీంతో చదలవాడ రోజులు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

భక్తులకు ఏం చేశారంటే?

భక్తులకు ఏం చేశారంటే?

మొత్తం మీద రెండేళ్ళపాటు పదవీకాలాన్ని పూర్తి చేసుకొన్నారు చదలవాడ నేతృత్వంలోని పాలకవర్గం.ఈ రెండేళ్ళలో భక్తులకు ఏం చేశారనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు నెలొక్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పాటించడం, అధికారులు తీసుకొన్న నిర్ణయాలకు స్టాంపు ముద్ర వేయడం మినహా టీటీడీ బోర్డు తీసుకొన్న నిర్ణయాలేవీ లేవంటున్నారు కొందరు భక్తులు.

13 వేల కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అలానే

13 వేల కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అలానే

టీటీడీ బోర్డు ఛైర్మెన్ గా చదలవాడ బాధ్యతలు స్వీకరించిన సమయంలో నెలకొన్న సమస్యలు అలానే ఉన్నాయి. 13 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఇబ్బందులు తీరుతాయని భావించారు. కానీ, భోర్డు ఛైర్మెన్ తో పాటు ఇద్దరు బోర్డు సభ్యులు కూడ తిరుపతికి చెందినవారే. కొండపై ఆలయ విస్తరణ పనుల కోసం తమ ఇళ్ళను పోగోట్టుకొన్న నిర్వాసితులకు దశాబ్దకాలం గడిచినా న్యాయం జరగలేదు. వీరిలో 120 మందికి తిరుమలలో దుకాణాలు కేటాయిస్తామన్న హామీ ఇప్పటివరకు అమలు కాలేదు.

ఖాళీగా ఉన్న 7 వేల పోస్టులను భర్తీ చేయలేదు

ఖాళీగా ఉన్న 7 వేల పోస్టులను భర్తీ చేయలేదు

అతిపెద్ద ధార్మిక వ్యవస్థ అయిన టీటీడీలో ఇప్పటికీ 7 వేల పోస్టుల ఖాళీగా ఉన్నాయి. వీటిని అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు వీటిని భర్తీ చేయలేదు. టీటీడీలో 13,500 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. టీటీడిలో కీలకపాత్ర పోషిస్తున్నవారికి కేవలం 7 వేల లోపు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన 151 జీవో ప్రకారం కనీసవేతనం 12 వేలు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా ప్రయోజనం లేకుండాపోయింది.

స్వయంప్రతిపత్తితో టీటీడి నిర్ణయాలు తీసుకోలేదా?

స్వయంప్రతిపత్తితో టీటీడి నిర్ణయాలు తీసుకోలేదా?

స్వయంపత్రిపత్తితో టీటీడి నిర్ణయాలు తీసుకోనే అవకాశం ఉంది. అయితే బోర్డు మాత్రం రెండేళ్ళపాటు అచేతనంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలను పాటించడం , టీటీడి అధికారులు తీసుకొన్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడానికే మాత్రమే బోర్డు సమావేశాలను నిర్వహించారు.ప్రైవేట్ సంస్థలకు నిధులిచ్చిన అంశాల్లో కొన్నిసార్లు కోర్టులతో మొట్టికాయలు తింది టిటిడి పాలకవర్గం.

కొత్త ఛైర్మెన్ ఎవరు?

కొత్త ఛైర్మెన్ ఎవరు?

టీటీడీ ఛైర్మెన్ గా చదలవాడ కృష్ణమూర్తికి మరోమారు పొడిగింపు అవకాశం దక్కనుంది ఆయన వర్గీయులు భావిస్తున్నారు.అయితే ఆయనకు మరోసారి అవకాశం దక్కకపోవచ్చని చెబుతున్నారు పార్టీ వర్గీయులు. టీటీడీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో చొరవ చూపలేదనే విమర్శలు లేకపోలేదు.మరోవైపు ఈ కారణాలన్నింటిని దృష్ట్యా కొత్తవారిని చైర్మెన్ గా నియమించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తిరుపతి వాసీగా ఉంటూనే టీటీడి ఛైర్మెన్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత సమస్యలు తీరుతాయని భావించినవారికి మాత్రం నిరాశే మిగిలింది.

English summary
TTD Chairmen Chadalawada Krishnamurthy completed two years term.Ap chiefminister will palnning to nominate new chairmen for TTD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X