వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుబ్బారెడ్డి అన్నంత ప‌నీ చేసేసారు: శ్రీవారి బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు: ప్రోటోకాల్ ప‌రిధిలో మాత్ర‌మే

|
Google Oneindia TeluguNews

Recommended Video

బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం|Subba Reddy Announced Key Decision About Break Darshanams

ఇక తిరుమ‌ల‌లో ప్ర‌ముఖ‌ల లేఖ‌లు బుట్ట‌దాఖ‌లే. ప్ర‌ముఖ‌ల లేఖ‌ల‌కు అనుగుణంగా ప్రాధాన్య‌త‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొ ని కేటాయించే మూడు ర‌కాలైన బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తూ టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసు కున్నారు. త‌క్ష‌ణం దీనిని అమ‌ల్లోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శ్రీవారి సేవ‌లో సిఫార్సుల‌ను ప‌క్క‌న పెట్టి సామాన్యుల కు శ్రీవారి ద‌ర్శ‌నాన్ని క‌ల్పించ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేసారు. ద‌ర్శ‌నానంత‌ర ద‌ర్శ‌నాన్ని తిరిగి ప్ర‌వేవ పెట్టాల ని భావిస్తున్న‌ట్లు త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, సుబ్బారెడ్డి తాజా నిర్ణ‌యం పైన ప్ర‌స్తుతం కోర్టులో ఒక వ్యాజ్యం న‌డుస్తోంది.

శ్రీవారి బ్రేక్ ద‌ర్శ‌నాలు రద్దు..
టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తీ రోజు ఉద‌యం మూడు కేట‌గిరీల్లో ఉండే ఈ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. టీటీడీకీ ప్ర‌తీ రోజు బోర్డు స‌భ్యులు..మంత్రులు..ఎమ్మెల్యేలు..ప్ర‌ముఖుల లేఖ‌ల ఆధారంగా వేల సంఖ్య‌లో బ్రేక్ ద‌ర్శ‌నాలు కేటాయిస్తున్నారు. దీని కార‌ణంగా సామాన్య భ‌క్తుల క్యూ లైన్ల‌ను మ‌ధ్య‌లోనే చాలా సేపు ఆపివేస్తున్నారు. ఫ‌లితంగా సామాన్య భ‌క్తులు గంట‌ల త‌ర‌బ‌డీ స్వామి వారి ద‌ర్శ‌నం కోసం నిరీక్షించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఒక ప్ర‌ముఖుడి సిఫార్సు లేఖ ఆధారంగా త్వ‌రిత గ‌తిన ద‌ర్శ‌నం క‌ల్పించి తాము గంట‌ల కొద్దీ లైన్ల‌లో నిలిచిన త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేదంటూ అనేక మంది టీటీడీ అధికారుల మీద ప‌లు సంద‌ర్భాల్లో గొడ‌వ‌కు దిగిన ప‌రిస్థితులు ఉన్నాయి. కొంత మంది కోర్టుకు కూడా వెళ్లారు. గ‌త ప్ర‌భుత్వ హాయంలోనూ సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్య‌త ఇస్తామ‌ని చెప్పినా..దానికి అనుగుణంగా నిర్ణ‌యం మాత్రం జ‌ర‌గ‌లేదు. తాజాగా వైసీపీ ప్ర‌భుత్వంలో టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మితులైన సుబ్బారెడ్డి బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

TTD Chairmen Subba Reddy announced Key decision that Break Darshanams in Tirumala has been stopped

ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం..
ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి స్వ‌యంగా వెల్ల డించారు. ఆ దర్శనాలను రద్దు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వివ‌రించారు. అర్చనాంతర దర్శనం విధా నాన్ని తిరిగి ప్రవేశ పెట్టేందుకు.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. మరింతమంది సామాన్యులకు స్వామి దర్శనాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు. ఇదే స‌మ‌యంలో ప్రొటోకాల్‌లో ఉన్న వ్య‌క్త‌ల‌కు ప్రాధాన్య‌త‌..అదే విధంగా ప్ర‌ముఖ‌ల బ్రేక్ మాత్ర కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో..ఇక నుండి మంత్రులు..ప్రజా ప్ర‌తినిదులు ఇచ్చే లేఖ‌ల‌కు విలువ లేదు. వారి లేఖ‌ల ఆధారంగా ద‌ర్శ‌నాలు ఉండ‌వ‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది. ఈ లేఖ‌ల ఆధారం గా సామాన్య భ‌క్తుల‌ను ఇబ్బంది క‌ల‌గ‌ట‌మే కాకుండా..కొంత మంది ఈ లేఖ‌ల ద్వారా సొమ్ము చేసుకుంటు విష‌యాన్ని ఛైర్మ‌న్ దృష్టికి తీసుకొచ్చారు. త్వ‌ర‌లోనే ఈ బ్రేక్ ద‌ర్శ‌నాల స్థానంలో ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల దిశ‌గా టీటీడీ క‌స‌ర‌త్తు చేస్తోంది.

English summary
TTD Chairmen Subba Reddy announced Key decision that Break Darshanams in Tirumala has been stopped to day on wards. To give Chance for common devotees this decision taken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X