తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిటిడి:970 కిలోల బంగారం ఎస్ బి ఐ లో డిపాజిట్,కిలోల కొద్ది బంగారం బ్యాంకుల్లో

టిటిడి 970.080 కిలోల బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది. గోల్డ్ మానిటైజేషన్ పథకంలో భాగంగా టిటిడి ఈ బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి:టిటిడి 970.080 కిలోల బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది. గోల్డ్ మానిటైజేషన్ పథకంలో భాగంగా టిటిడి ఈ బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది. ఈ మేరకు ఎస్ బి ఐ ఉన్నతాధికారులు ఈ డిపాజిట్ కు చెందిన పత్రాలను టిటిడి ఈవో సాంబశివరావుకు అందజేశారు.

2016 మార్చిలో టిటిడి బంగారాన్ని ఎస్ బి ఐలో డిపాజిట్ చేసింది. కాలపరిమితి పూర్తి కావడంతో వడ్డీ రూపంలో వచ్చిన వంగారాన్ని కలిపి తిరిగి అదే బ్యాంకులో 1 శాతం వడ్డీతో మూడేళ్ళ సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేసింది.

TTD deposited 970 kgs gold in SBI

శ్రీవారి హుండీ కానుకల రూపంలో అందిన మిక్స్ డ్ కేటరిగి బంగారు నగలు ,వస్తువులు కలిపి దాదాపుగా 1400 కిలోలను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 1.25 శాతం వడ్డీకి టిటిడి డిపాజిట్ చేసింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో కూడ 1311 కిలోల 0.995 స్వఛ్ఛత గల బంగారు కడ్డీలను 1.75 శాతం వడ్డీకి టిటిడి డిపాజిట్ చేసింది.డిపాజిట్ చేసిన బంగారంపైనే వడ్డీలు పెద్ద మొత్తంలో వస్తాయి.అయితే ఈ నిధులన్నింటిని టిటిడి అభివృద్ది కోసం ఖర్చు చేయనున్నారు.

English summary
TTD deposited 970 kgs gold in SBI.In 2016 March TTD deposited gold in SBI.with 1 percent interest TTD deposited 970 kgs gold in SBI.Around 1400 kgs gold TTD deposited in Indian Overseas bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X