వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీడీ బంగారం త‌ర‌లింపులో లోపాలు : స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తే త‌ప్పేంటి: సీయ‌స్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం..!

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజ‌లుగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు బంగారం త‌ర‌లింపు పైన జ‌రుగుతున్న వివాదం పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం స్పందించారు. ఇప్ప‌టికే ఈ వివాదం పై సీయ‌స్ నియ‌మించిన క‌మిటీ నివేదిక‌ను సీయ‌స్ కు అంద‌చేసింది. బంగారం త‌ర‌లింపు ప్ర‌క్రియ‌లో లోపాలున్నాయ‌ని సీయ‌స్ అభిప్రాయం వ్య‌క్తం చేసారు.

బంగారం త‌ర‌లింపులో లోపాలు..
టీటీడీ బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలున్నాయన్నది నిజమేనని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం పేర్కొన్నారు. తిరుమల వెంకన్న బంగారం తరలింపులో వెలుగుచూసిన లోపాలపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం పంపామని సీయ‌స్ స్ప‌ష్టం చేసారు. బ్యాంకు, టీటీడీ అధికారులు అంత అజాగ్రత్తగా వ్యవహరించాల్సింది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవారి బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయన్నారు. బంగారం తరలింపులో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందని చెప్పారు. సీనియ‌ర్ అధికారి తో చేయించిన విచార‌ణ నివేదిక‌ను పూర్తి స్థాయిలో అధ్య‌యం చేసిన త‌రువాత దీని పైన ఎలా ముందుకు వెళ్లాల‌నే దానిపైన కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు.

TTD done mistakes in Gold transport : CS LV Subramnayam report to CM..

స‌మీక్ష‌లు చేస్తే త‌ప్పేంటి..
ఇక‌, కోడ్ కార‌ణంతో ముఖ్య‌మంత్రి..మంత్రుల‌ను స‌మీక్ష‌లు చేయ‌వ‌ద్ద‌ని చెబుతూ..సీయ‌స్ ఎలా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తార‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సీయ‌స్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాఖల సమీక్షలు నిర్వహించటంలో తప్పేంటని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక .. రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలని సీఎస్‌ ఎల్వీ వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన నిబంధలనలు ఉన్నాయని తెలిపారు. దీని పైన టిడిపి నేత‌లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీయస ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం దొంగ దారిలో వ‌చ్చిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అని టిడిపి నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయ‌న క్యాబినెట్ నిర్ణ‌యాల‌ను ప్ర‌భావితం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఎల్వీ సుబ్ర‌మణ్యం సైతం తాను నిబంధ‌న‌ల మేర‌కే న‌డుచుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
AP Chief Secretary LV Subramnayam Says TTD Officials done mistakes in Gold moving from bank to TTD. Senior IAS Manmohan Singh submitted his enquiry report to CS. And also CS says as per Election commission norms only he is conducting reviews.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X