రాసలీలల ఉద్యోగి హత్యలో ట్విస్ట్: ఉద్యోగం కోసం భార్య, కూతుళ్లే చంపేశారు
విశాఖ: విశాఖ జిల్లాలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలుగులోకి వచ్చిన రాసలీలల వ్యవహారం, అనంతరం టిటిడి ఉద్యోగి మనోహరయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యవహారంలో కొత్త ట్విస్ట్. అతనిని భార్య, ఇద్దరు కూతుళ్లే వాలెంటరీ రిటైర్మెంట్ కోసం హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
టిటిడి ఉద్యోగి అయిన మనోహరయ్య రాసలీలలు చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే అతను శవమై తేలాడు. దీనిని పోలీసులు విచారించి, హంతకులు కుటుంబ సభ్యులేనని తేల్చారు. రాసలీలల కారణంగా మనస్తాపం చెంది తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మనోహరయ్య భార్య తెలిపింది.
కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా భార్య, కూతుళ్లు నిందితులు అని తేలింది. అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని పోలీసులు గుర్తించారు. వాలంటరీ రిటైర్మెంటు డిమాండ్ చేస్తూ మనోహర్ పైన కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నట్లు దర్యాఫ్తులో వెల్లడైంది.

దానికి మనోహరయ్య అంగీకరించలేదు. దీంతో ఆయనను రుబ్బురోలు, సుత్తితో కొట్టి హతమార్చారని పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన ఆయుధాలు రుబ్బురోలు, సుత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మనోహరయ్య పెద్ద కూతురుకు పెళ్లయింది. మనోహరయ్య వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే చిన్న కూతురుకు ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశ్యంతో భార్య శారద భర్త పైన ఒత్తిడి చేసింది. దానికి అతడు అంగీకరించలేదు. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. రాసలీలల కేసు అనంతరం అతనిని వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.
కాగా, విశాఖపట్నం జిల్లాలోని ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెలుగులోకి వచ్చిన రాసలీలల వ్యవహారంలో పట్టుబడిన టీటీడీ ఉద్యోగి మనోహరయ్య అంతకుముందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు.












Click it and Unblock the Notifications