తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణదేవరాయలు, మహారాజుల తర్వాత కేసీఆరే: టీటీడీ ప్రశంసలు(పిక్చర్స్)

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు ప్రశంసల వర్షం కురిపించారు. గ‌తంలో కేవ‌లం చ‌క్ర‌వ‌ర్తులు,

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు ప్రశంసల వర్షం కురిపించారు. గ‌తంలో కేవ‌లం చ‌క్ర‌వ‌ర్తులు, రాజులు మాత్ర‌మే ఇలా భారీ స్థాయిలో బంగారు కానుక‌ల‌ను వెంక‌న్నకు స‌మ‌ర్పించుకున్న‌ట్లు తెలిపారు. అప్పట్లో శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు, మైసూర్ మ‌హారాజులు ఇలాంటి ఖరీదైన కానులను శ్రీవారికి ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

తెలుగు రాష్ట్రాలు గొప్పగా, శ్రీవారికి ప్రాంతాలుండవు: తిరుమలలో కేసీఆర్(పిక్చర్స్) తెలుగు రాష్ట్రాలు గొప్పగా, శ్రీవారికి ప్రాంతాలుండవు: తిరుమలలో కేసీఆర్(పిక్చర్స్)

చరిత్రలో నిలిచిపోయారు..

చరిత్రలో నిలిచిపోయారు..

మ‌ళ్లీ ఇప్పుడు కేసీఆర్ చేసిన ఆభ‌ర‌ణ స‌మ‌ర్ప‌ణ చ‌రిత్ర‌లో నిలిచిపోయే అంశ‌మ‌న్నారు. భ‌గ‌వంతుడికి కానుక‌లు, ఆభ‌ర‌ణాలు స‌మ‌ర్పించ‌డంలో తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త అధ్యాయానికి నాంది ప‌లికింద‌న్నారు. ఆ కీర్తి కేసీఆర్‌కు ద‌క్కుతుంద‌ని టీటీడీ ఈవో అన్నారు.

తెలుగు రాష్ట్రాల పుణ్యమే..

తెలుగు రాష్ట్రాల పుణ్యమే..

'రెండు తెలుగు రాష్ట్రాల‌కు వెంక‌న్నే క‌లియుగ దైవం. ఈ క‌లియుగంలో ధ‌ర్మాచార‌మే అతిముఖ్యం. సీఎం కేసీఆర్ ఆ ఆచారాన్ని పాటించ‌డం తెలుగు ప్ర‌జ‌లు చేసుకున్న‌ పుణ్య‌మే' అని ఆయన వ్యాఖ్యానించారు.

మొక్కులు చెల్లించుకున్నారు..

మొక్కులు చెల్లించుకున్నారు..

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో తన మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమ‌ల‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామిని కేసీఆర్ దంపతులు, మంత్రులు బుధవారం ద‌ర్శించుకున్నారు.

శ్రీవారు, అమ్మవార్లకు కానుకలు

శ్రీవారు, అమ్మవార్లకు కానుకలు

తెలంగాణ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్‌కు తిరుమ‌ల వేద పండితులు ఆశీస్సులు అందించారు. మొదట తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్.. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి రూ. 5.59 కోట్ల విలువైన సాలగ్రామహారాన్ని, కంఠాభరణాన్ని, తిరుచానూర్ పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకను సమర్పించారు.

English summary
TTD EO Sambasiva Rao on Wednesday praised Telangana CM K Chandrsekhar Rao for presenting gifts to Srivaru and Padmavati ammavaru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X