• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోహన్ బాబుకు టీటీడి..!? నామినేటెడ్ పదవి ఆశిస్తున్న కలెక్షన్ కింగ్..!?

|

అమరావతి/హైదరాబాద్ : విలక్షణ నటుడు మోహన్ బాబుకు వైసిపి ప్రభుత్వంలో అనుకోని పదవి వరించబోతోంది. జగన్ మోహన్ రెడ్డి కుంటుంబంతో చుట్టరికం ఉండడమే కాకుండా మంచి సత్సంబాంధాలు కలిగి ఉన్నారు మోహన్ బాబు. సమయం చిక్కినప్పుడల్లా జగన్ కు అనేకూలంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు వార్తల్లో నిలిచారు ఈ కలెక్షన్ కింగ్. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఎవరూ ఊహించని మెజీరిటీని జగన్ మోహన్ రెడ్డి సాదించుకోవడంతో అందరి ద్రుష్టి నామినేటెడ్ పదవుల పై పడింది. పదవుల పందారంలో మోహన్ బాబు ప్రముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

 జగన్ సన్నిహితుల కోరికలు..!నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న మిత్రబృందాలు..!!

జగన్ సన్నిహితుల కోరికలు..!నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న మిత్రబృందాలు..!!

జగన్ సీఎం కావాలన్న తపన ఆయన కుటుంబీకులు, సన్నిహితులకు మాత్రమే కాదు. వైసీపీలోని అనేకమందికి ఇదొక చిరకాల స్వప్నం. అదిప్పుడు నెరవేరింది. వైసీపీ నాయకులకు ఇప్పుడు మరిన్ని కల లు కొత్తగా వస్తున్నాయి. నిద్రలోనే కాదు, మేల్కొన్నప్పుడు కూడా. ఒకొక్కరికి ఒక్కో రకం కల. ఆ కలల పేరే నామినేటెడ్ పదవులు..! విలక్షణ నటుడు, జగన్ సన్నిహిత మిత్రుడు మోహన్ బాబు కూడా మొన్నటి నుంచి 'కల'గంటున్నారట..!! తనకు అతి 'పెద్ద' నామినేటెడ్ పదవిని సీఎం ఇవ్వబోతున్నారని కలవరిస్తున్నాట్టు తెలుస్తోంది.

 టీటీడి పై కన్నేసిన కలెక్షన్ కింగ్..! పోటీలో వైవీ సుబ్బారెడ్డి..!!

టీటీడి పై కన్నేసిన కలెక్షన్ కింగ్..! పోటీలో వైవీ సుబ్బారెడ్డి..!!

దేశంలోనే అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి.. తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వర స్వామి క్షేత్రం. ఈ టీటీడీ చైర్మన్ పదవి చాలా పెద్దది. పైగా, ఆ దేవదేవుడి సేవలో తరించవచ్చు. ఏపీలోనే ప్రతి నాయకుడు కోరుకునే పదవి ఇది. సీఎం జగన్, ఇప్పుడు ఈ పదవిని మోహన్ బాబుకు కట్టబెడతారన్న చర్చ సాగుతోంది.

 రద్దు కానున్న బోర్డ్..! టీటీడి ఛైర్మన్ పదవి జగన్ ఎవరికి ఇస్తారో..!!

రద్దు కానున్న బోర్డ్..! టీటీడి ఛైర్మన్ పదవి జగన్ ఎవరికి ఇస్తారో..!!

టీటీడీ ప్రస్తుత చైర్మన్ గా పుట్టా సుధాకర్ ఉన్నారు. ఆయనను మాజీ సీఎం చంద్రబాబు నియమించారు. అధికారం మారినప్పటికీ తన పదవికి రాజీనామా చేసేది లేదని సుధాకర్ మంకుపట్టు పడుతున్నట్టు తెలుస్తోంది. చివరి నిమిషం వరకు టీటీడీ చైర్మన్ కుర్చీని గట్టిగా పట్టుకునే ఉంటాని అంటున్నాడు. చంద్రబాబు భర్తీ చేసిన నామినేటెడ్ పదవులన్నీ ఇంకొన్ని రోజుల్లో రద్దు కానున్నాయి.

పదవి వరించేది ఒక్కరినే..!!

పదవి వరించేది ఒక్కరినే..!!

వాటిలో ఏదో ఒకటి తమకు వస్తుందేమోనని వైసీపీ ముఖ్య నాయకులు ఆశల పల్లకీలో ఊరేగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం... టీటీడీ చైర్మన్ పదవి పైనే చర్చ సాగుతోందట. దీనిని మోహన్ బాబుకుగానీ, వైవీ సుబ్బారెడ్డికిగానీ (2014లో ఒంగోలు ఎంపీగా గెలిచిన సీటును 2019 ఎన్నికల్లో జగన్ అడగగానే త్యాగం చేసినందుకు ప్రతిఫలంగా), రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డికిగానీ (రాజంపేట సిట్టంగ్ సీటును, జగన్ అడిగిన వెంటనే టీడీపీ నుంచి వచ్చిన మల్లికార్జున్ రెడ్డి ఇచ్చినందుకుగాను), తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికిగానీ (జగన్మోహన్ రెడ్డికి ఈయన సోదర సమానుడు) కట్టబెట్టవచ్చట. చూద్దాం.... టీడీపీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.

English summary
collection king Mohan babu expecting a big nominated post in jagan's government.He is veru close to jagan's family and relative too. In that manner mohan babu expecting the prestagious ttd board chairman post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X