శ్రీవారి సేవకుల చిరకాల కోరిక తీర్చనున్న టీటీడీ

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆరంభం అయ్యాయి. మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. ఇందులో భాగంగా శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు.

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవకులను మరింత విస్తృతంగా వినియోగించుకోనుంది టీటీడీ. ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వారితో సమావేశం అయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులతో తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారిని భగవద్భంధువులుగా అభివర్ణించారు. శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు.

TTD given assurance to Srivari Sevaks

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తానని తెలిపారు. దేశంలోని ఎంతోమంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని, తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని, వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని చెప్పారు. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని, ఈ విభాగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

శ్రీవారి సేవకుల సేవా కాలం ముగిసిన అనంతరం వారు భక్తులకు అందిస్తున్న విశేష సేవలకుగాను మరింత మెరుగైన స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. పని వేళలతో పని లేకుండా నిరంతరం భక్తుల సేవలో అహర్నిశలు శ్రమించే టీటీడీ ఉద్యోగులకు ప్రతి విభాగంలోనూ శ్రీవారి సేవకులు వెన్నుదన్నుగా ఉంటోన్నారని చెప్పారు.

బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వర్తించడానికి డెప్యూటేషన్ పై వచ్చిన అధికారులు, సిబ్బందితో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి వేరుగా మరో సమావేశాన్ని నిర్వహించారు. వారికి దిశా నిర్దేశం చేశారు. ఈసారి బ్రహ్మోత్సవాలను ఎంతో సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించామని, నిర్ధుష్ట విధివిధానాలతో పాటు చెక్‌లిస్ట్‌లను కూడా సిద్ధం చేశామని, తద్వారా భక్తుల నుండి సరైన ఫీడ్‌బ్యాక్ పొందేందుకు వీలుకలుగుతుందని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+