వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త .. అక్కడ ఇక క్యూ లైన్ కష్టాలు లేనట్టే ... ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ| Good News For Tirumala Devotees,No Need To Wait In Longer Queue

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త . టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భక్తులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి .ఇప్పటి వారకు స్వామి వారిని దర్శించుకోవాలంటే.. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇక నుండి ఆ కష్టం లేకుండా చేసే పనిలో ఉంది టీటీడీ . ముఖ్యంగా నారాయణగిరి ఉద్యానవనం వద్ద భక్తుల క్యూ లైన్ సమస్య పరిష్కరించే ప్రయతనం చేస్తుంది.

ఏపీ ప్రజలు తెలంగాణలో రేషన్ తీసుకుంటున్నారు.. ఎందుకో తెలుసా ?ఏపీ ప్రజలు తెలంగాణలో రేషన్ తీసుకుంటున్నారు.. ఎందుకో తెలుసా ?

దీనికి కారణం స్వామీ వారి దర్శానానికి దివ్య, సర్వదర్శన స్లాటెడ్‌ టోకెనలు వేసుకున్న భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి ఉద్యానవనంలో రూ.25 కోట్ల వ్యయంతో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పూర్తికానుంది. ఇక ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే క్యూ లైన్ లో వేచి వుండే అవసరం ఉండదు . సెప్టెంబరు నెలాఖరులో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల సమయానికి వీటిని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

TTD good news for the devotees .. there is no need to wait in longer queue

స్లాటెడ్‌ టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన స్లాట్‌తో నిమిత్తం లేకుండా కాస్త ముందుగా శ్రీవారి దర్శనం ముగించుకోవాలనే ఆలోచనతో నారాయణగిరి ఉద్యానవనాల వద్ద ముందుగా వెళ్లి అక్కడ వేచి వుంటున్నారు . ఇలాంటి వారిని క్యూలైన్‌ ప్రవేశం వద్ద సిబ్బంది అడ్డుకుని టోకెన్‌పై ఉన్న సమయానికి గంట ముందుగా మాత్రమే రావాలని తిప్పి పంపాల్సి వస్తోంది. ఇక దీంతో భక్తులు తిరిగివెళ్లక గంటలకొద్ది రోడ్లపై, చెట్లకింద గడుపుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కో రోజు ఆ ప్రాంతంలో రద్దీ పెరిగి తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. కనుక భక్తుల సౌకర్యార్ధం ఆ సమస్యకు పరిష్కారంగా ఈ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్తున్నారు టీటీడీ అధికారులు . ఈ భవనాలు పూర్తైతే.. క్యూలైన్ లలో నిలబడే బదులు ఆ గదుల్లో విశ్రాంతి తీసుకొని తర్వాత స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.

English summary
TTD's latest building complex will be completed in two months at Narayangiri Gardens at a cost of Rs 25crores. TTD officials are making efforts to make these available to devotees by the time of the annual Brahmotsavas, which will begin in the month of September.If these buildings are completed .. Instead of standing in the queues, piligrims take rest in the rooms and then visit Swami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X