వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: లడ్డు ధర భారీగా పెంచిన టిటిడి, రూ.300 కోట్ల నష్టం భర్తీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

తిరుమల దర్శనానికి కోటా ? లడ్డు ధర అంతా, 300 కోట్ల నష్టం భర్తీ కా ?

అమరావతి:లడ్డు ధరను పెంచాలని టిటిడి నిర్ణయం తీసుకొంది. సబ్సీడీ, ఉచిత లడ్డూలతో టిటిడిపై పడుతున్న భారాన్ని పూడ్చుకొనేందుకు ధరలను పెంచాలని టిటిడి నిర్ణయం తీసుకొంది. భారీగా లడ్డూల దరలను పెంచింది. అయితే ధరల పెంపుతో ప్రతి ఏటా పడుతున్న రూ.300 కోట్ల భారాన్ని కూడ పూడ్చుకోవచ్చని టిటిడి భావిస్తోంది.

తిరుపతికి వెళ్ళామంటే లడ్డూ తీసుకోకుండా ఉండలేం. తిరుపతికి వెళ్ళి వచ్చినట్టుగా లడ్డును బంధువులకు, స్నేహితులకు పంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తిరుపతికి వెళ్ళే భక్తులకు మాత్రం లడ్డులు కొనుగోలు చేయాలంటే జేబులు చిల్లులు పడాల్సిందే.

ధరలు పెంచినా కానీ, లడ్డుల కొనుగోలుపై ఏ మాత్రం ప్రభావం ఉండదని టిటిడి భావిస్తోంది. అంతే కాదు ప్రతి రోజూ తయారు చేసే లడ్డుల కంటే అదనంగా లడ్డులను తయారు చేయాల్సిన అవసరం ఉందని టిటిడి భావిస్తోంది.

భారీగా లడ్డూల ధరల పెంపు

భారీగా లడ్డూల ధరల పెంపు

లడ్డూల ధరలను టిటిడి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకొంది. తిరుపతికి వెళ్ళే భక్తులకు ఉచితంగా ఇచ్చే లడ్డూలతో పాటు, సబ్సిడీపై ఇచ్చే లడ్డూల భారాన్ని పూడ్చుకొనేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం రూ.25లకు విక్రయిస్తున్న లడ్డును రూ. 50లకు, కళ్యాణం లడ్డును రూ.100 నుండి రూ200లకు పెంచారు. వడ ప్రసాదం ధరను రూ.25 నుండి రూ.100లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.

 ప్రతి ఏటా టిటిడిపై రూ300 కోట్ల భారం

ప్రతి ఏటా టిటిడిపై రూ300 కోట్ల భారం

ఉచిత లడ్డూలు, సబ్సిడీపై ఇచ్చే లడ్డూలతో టిటిడిపై ఏటా రూ300 కోట్ల భారం పడనుంది. ఈ భారాన్ని పూడ్చుకోవాలని చాలా కాలంగా టిటిడి యోచిస్తోంది. అయితే లడ్డూల ధరలను పెంచడమే దీనికి పరిష్కారమని భావించింది. ఈ మేరకు లడ్డూల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకొంది.

 ఒక్క లడ్డుకు రూ. 37 ఖర్చు

ఒక్క లడ్డుకు రూ. 37 ఖర్చు

ఒక్కో లడ్డు తయారీకి రూ. 37 ఖర్చు అవుతోంది. ఈ కారణంగా ఈ ఖర్చును పూడ్చుకొనేందుకు లడ్డు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. ధరల పెంపు కారణంగా లడ్డూల విక్రయాలు తగ్గిపోవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఇంకా ఎక్కువ మొత్తంలో విక్రయాలు జరిగే అవకాశాలు కూడ లేకపోలేదంటున్నారు.

ప్రతి రోజూ 50 వేల లడ్డూల తయారీ

ప్రతి రోజూ 50 వేల లడ్డూల తయారీ

గతంలో ప్రతి రోజూ 30 వేల లడ్డూలను తయారు చేసేవారు. అయితే లడ్డూల ధరలను పెంచినా కానీ లడ్డూల విక్రయాలు తగ్గిపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రతి రోజూ 50 వేల లడ్డూలను తయారు చేయాలని టిటిడి నిర్ణయించింది.

English summary
The TTD is making arrangements to provide required laddus for devotees. The temple management has hiked the price of laddus which were given through different sevas in order to minimise loss arising out of distributing laddus for free and on subsidy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X