TTD: తిరుమల గదుల కేటాయింపులో కొత్త విధానం - మీ చేతిలోనే, ఇక నుంచి..!!

Tirumala: టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత పెంచేలా కొత్త విధానాలు అందుబాటులోకి తీసుకొస్తోంది. బ్రేక్ దర్శనంలో వేళల మార్పు పైన ప్రయోగాత్మ కంగా కొన్ని నిర్ణయాలు అమలు చేస్తోంది. అదే సమయంలో బ్రేక్ దర్శనాలను పరిమితం చేసేలా కసరత్తు కొనసాగుతోంది. ఐఏ ద్వారా దర్శనంలో కొత్త విధానాలు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో వసతి విషయంలో టీటీడీ కీలక మార్పులు తీసుకొస్తోంది. భక్తుల కు మరింత సలభతరం చేసేలా నిర్ణయం తీసుకుంది.

గదుల కేటాయింపులో
తిరుమలలో వసతి విషయంలో టీటీడీ వరుస మార్పులు చేస్తోంది. తాజాగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు దర్శనం ఎన్ రోల్ మెంట్ స్లిప్ పైనే గదుల కేటాయింపు విధానం టీటీడీ ఏఈవో కార్యాలయంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు భక్తులు తమకు సిఫారసు చేసిన వారి అసలు ధ్రువ పత్రాలతో పాటు ఒక జిరాక్స్ ప్రతి తీసుకురావాల్సి వచ్చేది. ఆ జిరాక్స్ ప్రతిపై అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది గదుల కేటాయింపునకు స్టాంపింగ్ చేసేవారు. ఇందు కోసం క్యూ లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. భక్తులకు సమయం తీసుకోవటంతో పాటుగా ఇబ్బందులు ఎదుర్కునేవారు.

ttd-introduces-new-accommodation-system-for-devotees-in-tirumala

తాజా మార్పుతో
కాగా, తాజాగా ఏఈవో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక నుంచి భక్తుడు దర్శన ఎన్ రోల్ మెంట్ స్లిప్ తో గదుల కేటాయింపు కేంద్రాల వద్దకు వెళ్లి స్కానింగ్ చేస్తే సులభంగా గదులు పొందేలా మార్పులు చేసారు. ఈ విధానంతో భక్తులకు వెసులుబాటు కలగనుంది. తిరుమలలో నిత్యం వచ్చే వేలాది మంది భక్తుల కోసం 7500 గదులు అందుబాటులో ఉన్నాయి. గత పాలక మండలి తిరుమలలోని వసతి సముదాయాల్లో మరమ్మత్తుల కోసం రూ 110 కోట్లు ఖర్చు చేసారు. తాజా పరిశీలనలో తిరిగి ఆ సముదాయాల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. సుదర్శన్ లో 389, గోవర్ధన్ లో 196, కల్యాణ్ సత్రంలో 246 గదుల ఉన్నాయి. వీటిల్లో నీరు లీకు అవ్వటం.. పెచ్చులు ఊడటం వంటి సమస్యలు అధికారులు టీటీడీకి నివేదించారు.

Take a Poll

కొత్త ప్రతిపాదనలు
దీంతో, తాజాగా టీటీడీ అధికారులు ఈ సమస్య పైన ఫోకస్ చేసారు. శిథిలమైన భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా, వరాహస్వామి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఇక.. తిరుమలకు వచ్చే వీఐపీ భక్తులకు గదుల కేటాయింపు విషయంలోనూ కొత్త పక్రియ అందుబాటులోకి తీసుకొచ్చారు.తిరుమలలో ఉన్న గదుల్లో 3500 గదులను సామాన్య భక్తులకు కోసం సీఆర్వో పరిధిలో ఉన్న ఈ గదులను ఆధార్ కార్డు ద్వారా కరెంట్ బుకింగ్ కింద కేటాయింపు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కింద మరో 1,580 గదులను భక్తులకు కేటాయిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+