టిటిడి ఛైర్మన్‌గా చదలవాడ: టి నుంచి ముగ్గురు సభ్యులు
హైదరాబాద్/తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ఛైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి నియామకం ఖరైరాంది. టిటిడి బోర్డ్‌లో 18 మంది సభ్యులను కూడా నియమించారు. వీరి నియామకాలపై సోమవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కమిటీలో భారతీయ జనతా పార్టీ సభ్యులకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చోటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాక కర్ణాటక, తమిళనాడు వారికి చోటు కల్పించింది. తెలంగాణ నుంచి ముగ్గురు సభ్యులు నియమితులయ్యారు.

తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సాయన్న, సండ్ర వెంకటవీరయ్య, బిజెపికి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి నియమితులయ్యారు.
ఏపి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాస్, ఆకుల సత్యనారాయణ, పతివాడ నారాయణస్వామి, తిరుపతికి చెందిన బిజెపి నేత భానుప్రకాశ్‌లు నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications