తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిటిడిలో భారీ కుంభకోణం: ఏడాదిలో 60వేల లడ్డూలు కాజేశాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి ఒకరు భారీ కుంభకోణంలో దొరికిపోయాడు. అతనిని దేవస్థానం సస్పెండ్ చేసింది. ఒక ఏడాదిలో అరవై వేల లడ్డూలు కాజేసినట్లుగా వెంకటరమణ అనే ఉద్యోగి పైన ఆరోపణలు వచ్చాయి.

అతని అక్రమాల బాగోతం డిప్యూటీ ఈవో దృష్టికి వచ్చాయి. డిప్యూటీ ఈవోకు అనుమానం రావడంతో ఈ కుంభకోణం బయటపడింది. శ్రీవారి ఖజానాకే వెంకటరమణ చిల్లు పెట్టినట్లుగా నిర్ధారించుకున్నారు. భక్తులకు పంపాల్సిన లడ్డూలను అతను కాజేశాడు.

ఏడాదిలో భక్తులకు చెందిన అరవై వేల లడ్డూలు కాజేసిన అధికారి వెంకట రమణ పైన వెంటనే చర్యలు తీసుకున్నారు. అతనిని సస్పెండ్ చేస్తున్నట్లు ఈవో సాంబశివ రావు చెప్పారు. రెండున్నరేళ్లుగా వెంకటరమణ డోనర్ సెల్‌లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతనిని అధికారులు విచారిస్తున్నారు.

TTD official suspended in laddu scam

లడ్డూ అక్రమాల పైన విజిలెన్స్ విచారణ జరుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. ఇక పైన అక్రమాలకు తావులేకుండా మార్పులు చేస్తామని చెప్పారు.

విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభం

విజయవాడలో మంగళవారం నాడు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. రెండంకెల వృద్ధి, నెపుణ్యాభివృద్ధిపై సమీక్షను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల కలెక్టర్లు సదస్సులో పాల్గొన్నారు.

English summary
Tirumala Tirupati Devastanam official suspended in laddu scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X