వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విఐపీలకు టిటిడి షాక్?: టిక్కెట్ల ధరలను భారీగా పెంచేందుకు ప్లాన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుమల: తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు విఐపీలకు కేటాయించే దర్శన టిక్కెట్ల ధరలను భారీగా పెంచాలని టిటిడి భావిస్తోంది. ఈ మేరకు టిటిడి ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలను పంపిందిత. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఈ టిక్కెట్టు ధరలను పెంచనున్నారు.

శ్రీవారి దర్శనం కోసం విఐపీలు పెద్ద ఎత్తున వస్తుంటారు. విఐపీల దర్శనాల కోసం అధికారులు ఇబ్బందులు పడుతుంటారు.అయితే ప్రస్తుతం విఐపీ దర్శనం కోసం ఉన్న టిక్కెట్ల ధరలను భారీగా పెంచాలని టిటిడి ప్రతిపాదించింది.

జిఎస్టీ ఎఫెక్ట్: టిటిడిపై ఏటా రూ. వంద కోట్ల భారం, లడ్డూపై నో ఎఫెక్ట్జిఎస్టీ ఎఫెక్ట్: టిటిడిపై ఏటా రూ. వంద కోట్ల భారం, లడ్డూపై నో ఎఫెక్ట్

అయితే ప్రభుత్వం టిటిడి ధరల పెంపుకు అంగీకరిస్తే భారీగా ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సేవా టిక్కెట్ల ధరలను కూడ పెంచే అవకాశాలు కూడ ఉన్నాయని సమాచారం.

 విఐపీ టిక్కెట్లను ధరలను పెంచనున్న టిటిడి

విఐపీ టిక్కెట్లను ధరలను పెంచనున్న టిటిడి

శ్రీవారి దర్శనం కోసం కేటాయించే విఐపీ దర్శన టిక్కెట్టు ధరలను పెంచాలని టిటిడి భావిస్తోంది. ఎల్ 1 టిక్కెట్ దర ప్రస్తుతం రూ.500. అయితే ఈ ధరను రూ 5 వేలకు పెంచాలని టిటిడి ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది. ద్వితీయ ప్రాధాన్యం ఉన్న ఎల్ 2 టిక్కెట్ ధరలను రూ.2 వేలకు పెంచాలని యోచిస్తోంది టిటిడి.అయితే ఎల్ 3 టిక్కెట్టు ధరలను మాత్రం యధాతథంగా ఉంచే అవకాశాలున్నాయి.

ప్రభుత్వ అనుమిస్తే టిక్కెట్టు దరలు

ప్రభుత్వ అనుమిస్తే టిక్కెట్టు దరలు

ప్రభుత్వం అనుమతిస్తే టిటిడి టిక్కెట్లు ధరలు పెరిగే అవకాశం ఉంది.ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. అయితే ప్రభుత్వం మాత్రం టిక్కెట్ల ధరలను భారీగా పెంచేందుకు అనుమతిని ఇస్తోందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 ఐదేళ్ళుగా ధరల పెంపుపై చర్చ

ఐదేళ్ళుగా ధరల పెంపుపై చర్చ

ఐదేళ్ళుగా టిటిడి టిక్కెట్ల ధరల పెంపుపై చర్చ తెర మీదికి వచ్చింది. కానీ, అనేక కారణాలతో టిక్కెట్టు ధరలను మాత్రం పెంచలేదు. ధర్మకర్తల మండలి సమావేశంలో కూడ టిక్కెట్టు ధరల పెంపు విషయమై చర్చించారు. కానీ, మెజారిటీ సభ్యులు ధరల పెంపును వ్యతిరేకించారు. దరిమిలా ధరల పెంపు నిర్ణయం వెనక్కు వెళ్ళింది. మరోసారి టిటిడి టిక్కెట్ల ధరల పెంపు విషయమై ప్రతిపాదనలు సిద్దం చేయడంతో ఈ విషయం మరోసారి తెరమీదికి వచ్చింది.

అన్ని రకాల సేవలపై ప్రభావం

అన్ని రకాల సేవలపై ప్రభావం

ఎల్1 ,ఎల్ 2 టి టిక్కెట్టు ధరల పెంపు అంశం ఇతర సేవల టిక్కెట్లపై కూడ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రోటోకాల్ వర్తించే విఐపీలకు మాత్రమే ఎల్ 1 టిక్కెట్లను కేటాయిస్తున్నారు. దీంతో ఎల్ 1 టిక్కెట్ల కోసం అధికారులపై ఒత్తిడి పెరిగింది. దీంతో ధరల పెంపు ప్రతిపాదనను ముందుకు వచ్చిందని సమాచారం. సుప్రభాతం, తోమాల, అర్చన లాంటి సేవల టిక్కెట్ల ధరలు కూడ పెరిగే అవకాశాలు కూడ లేకపోలేదు.

English summary
TTD planning to hike L1, L2 tickets rates.TTD already sent to proposals of ticket rates.TTD officers are waiting for government decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X