చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి భక్తుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం: కరోనా వ్యాప్తి చెందకుండా: అయినా..54 రోజులుగా

|
Google Oneindia TeluguNews

తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన ఏడుకొండలవాడిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అంటూ ఎదురు చూస్తోన్న కోట్లాదిమంది భక్తుల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. నాలుగో విడత లాక్‌డౌన్‌లో కూడా ఆలయాలను భక్తుల కోసం తెరవడానికి వీలు కల్పించలేదు. ఈ సారి భారీ మార్పులు ఉంటాయని, పాక్షికంగా అయినా సరే.. ఆలయాల్లో భక్తుల ప్రవేశాన్ని కల్పిస్తారని భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా మారింది. ఆలయాల్లో భక్తులను ప్రవేశించడంపై యధాతథంగా నిషేధాన్ని కొనసాగించింది..

మళ్లీ మొదటికొచ్చినట్టే: ఏపీలో హాఫ్ సెంచరీ దాటిన కరోనా కేసులు: కొంత గ్యాప్ తరువాత..మళ్లీ మొదటికొచ్చినట్టే: ఏపీలో హాఫ్ సెంచరీ దాటిన కరోనా కేసులు: కొంత గ్యాప్ తరువాత..

ఈ నెల 31వ తేదీ వరకూ..

ఈ నెల 31వ తేదీ వరకూ..

దీనికి అనుగుణంగా ఈ నెల 31వ తేదీ వరకు భక్తుల రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిజానికి- సోమవారం నుంచి ఆరంభమైన 14 రోజుల నాలుగో విడత లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులను ఇచ్చింది. నిర్దేశిత పని వేళల ప్రకారం.. పరిమితంగా షాపులను తెరవడానికి వీలు కల్పించింది. అయిప్పటికీ.. ఆలయాలపై మాత్రం నిషేదాన్ని కొనసాగించింది. పెద్ద సంఖ్యలో భక్తులు గుమికూడే ప్రదేశాలు కావడం వల్లే గుడులను తెరవడానికి అనుమతి ఇవ్వలేదని అంటున్నారు.

నాలుగో విడతలోనూ నో ఛాన్స్..

నాలుగో విడతలోనూ నో ఛాన్స్..

నాలుగో విడతలో ఆలయాలను భక్తుల కోసం తెరవడానికి అవకాశం ఉందనే సంకేతాలు రావడం వల్ల ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పెద్ద ఎత్తున ముందుజాగ్రత్త చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సైతం వారు రూపొందించుకున్నారు. క్యూలైన్లలో భక్తులు సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించడానికి రెడ్ టేప్‌లతో మార్కింగ్ సైతం చేశారు. పరిమితంగా భక్తులను అనుమతి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు. రోజూ ఏడువేల మందికి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించబోతున్నామనీ ఇదివరకే వెల్లడించారు.

కేంద్రం అనుతించిన తరువాతే..

కేంద్రం అనుతించిన తరువాతే..

తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచినట్టు తయారైంది టీటీడీ పరిస్థితి. కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్త చర్యలను తీసుకున్నప్పటికీ.. అనుమతి మాత్రం రాలేదు. ఫలితంగా- నాలుగో విడత లాక్‌డౌన్ ముగియబోతున్న ఈ నెల 31వ తేదీ వరకు భక్తులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చిన తరువాతే.. ఆలయంలో భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు.

Recommended Video

Tirumala Getting Ready For Post-Lockdown Life
28న టీటీడీ పాలక మండలి భేటీ..

28న టీటీడీ పాలక మండలి భేటీ..

ఇలాంటి పరిణామాల మధ్య ఈ నెల 28వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ కొనసాగుతుంది. ఎక్కడి వారు అక్కడే ఉంటూ ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరవుతారు. తిరుమలలో భక్తులకు పునఃప్రవేశం కల్పించడం, దానికి అనుగుణంగా తీసుకున్న చర్యలు వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. 54 రోజులుగా శ్రీవారి ఆలయంలో భక్తులకు ప్రవేశాన్ని కల్పించకపోవడం వల్ల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది టీటీడీ. ఉద్యోగులకు జీతాలను చెల్లించలేని స్థితిలో ఉంది. లాక్‌డౌన్ మరిన్ని రోజుల కొనసాగించాల్సి వచ్చినందున.. ఈ లోటును ఎలా చేయాలనే విషయంపైనా పాలక మండలి సభ్యులు చర్చించనున్నారు.

English summary
The Tirumala Tirupati Devasthanams (TTD), officials were suspended the Lord Balaji's darshan at Tirumala till May 31. On the orders of the central government, the decision to suspend the TTD Srivari darshan until 31st of this month was taken by the TTD officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X