వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయసాయిరెడ్డి, రమణదీక్షితులకు టీటీడీ షాక్‌- సొంత ప్రభుత్వంలోనూ పరువునష్టం కేసులు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని విపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించేది. ఇందుకు ఆధారంగా అప్పట్లో టీటీడీ నుంచి ప్రధాన అర్చక పదవిలో నుంచి తొలగించిన రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలు చూపించేది. ఇదే కోవలో పింక్‌ డైమండ్‌ను టీడీపీ ప్రభుత్వ పెద్లల ఇంటికి తరలించారంటూ మరో కొత్త వాదనను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు రమణదీక్షితులు కూడా తీసుకొచ్చారు.

గత ప్రభుత్వంలో పింక్‌ డైమండ్‌తో పాటు పలు అంశాల్లో తమపై చేసిన ఆరోపణలపై అప్పట్లో టీటీడీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై పరువునష్టం కేసులు దాఖలు చేసింది. ఇద్దరూ తలో వంద కోట్ల రూపాయల మొత్తం పరువునష్టం కింద చెల్లించాలని
టీటీడీ కోరింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం, సొంత వైసీపీ ప్రభుత్వం రావడంతో విజయసాయిరెడ్డితో పాటు రమణదీక్షితులపై దాఖలు చేసిన పరువునష్టం దావాను టీటీడీ వెనక్కి తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత టీటీడీ ఈ పిటిషన్‌ వెనక్కి తీసుకుంటూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. కానీ ఏమైందో ఏమో కానీ టీటీడీ మనసు మార్చుకుంది.

ttd to keep defamation cases against ysrcp mp vijaya sai reddy and ramana deekshitulu

విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై దాఖలైన పరువునష్టం కేసును కొనసాగిస్తామని టీటీడీ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. 2018లో దాఖలైన ఈ కేసును కొనసాగించాలని భావిస్తున్నట్లు టీటీడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకుంటున్నట్లు టీటీడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో సాయిరెడ్డి, రమణదీక్షితులపై దాఖలైన అభియోగాలపై విచారణ ఎదుర్కోక తప్పదు.

English summary
in a shocking decision, tirumala tirupathi devastham has decided to continue demation suits filed against ysrcp mp vijaya sai reddy and ttd honarary head priest ramana deekshitulu in missing of pind diamond issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X