తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరి చూపూ టీటీడీపైనే: గత పాలక మండలి తప్పులను తిరగదోడుతుందా?: కాగ్ ఎంట్రీ?

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇంకాస్సేపట్లో సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీని నిర్వహించబోతోంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, సంయుక్త కార్యనిర్వహణాధికారిణి భార్గవి, బోర్డు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇదివరకెప్పుడూ లేనంతగా ఈ సారి టీటీడీ పాలక మండలి భేటీకి ప్రాధాన్యతను సంతరించుకుంది.

జగన్ సర్కార్ వెనకడుగు: హైకోర్టు మెట్లెక్కనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి?: తెలుపుతో సరిజగన్ సర్కార్ వెనకడుగు: హైకోర్టు మెట్లెక్కనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి?: తెలుపుతో సరి

వివాదాస్పద నిర్ణయాలపై ఏం చేస్తుందో..

వివాదాస్పద నిర్ణయాలపై ఏం చేస్తుందో..

కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారానికి కేంద్రబిందువైన అంశం.. టీటీడీ నిరర్ధక ఆస్తుల విక్రయం. తమిళనాడులో అన్యాక్రాంతమౌతోన్న శ్రీవారికి చెందిన 23 నిరర్థక ఆస్తులను విక్రయించి.. దాని ద్వారా వచ్చిన నగదున టీటీడీ ఖాతాల్లో జమ చేయడానికి పాలక మండలి చేసిన ప్రయత్నాలు ఏ స్థాయిలో వివాదాలను రేకెత్తించాయో తెలిసిన విషయమే. దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిరర్థక ఆస్తులను గుర్తించే ప్రయత్నమే తప్ప విక్రయించాలనే ఆలోచన లేదంటూ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.

ఆస్తుల అమ్మకాలపై కీలక నిర్ణయం..

ఆస్తుల అమ్మకాలపై కీలక నిర్ణయం..

నిరర్థక ఆస్తుల అమ్మకాలపై టీటీడీ పాలక మండలి వైఖరి ఏమిటనేది కాస్సేపట్లో స్పష్టం కానుంది. తాము వాటిని విక్రయించుకోవాలనుకోవట్లేదంటూ వైవీ సుబ్బారెడ్డి పాలక మండలి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. ఫలితంగా- ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు హయాంలో పని చేసిన పాలక మండలి చేసిన వివాదాస్పద తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలను తిరగదోడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

కాగ్ ఎంట్రీకి అవకాశం ఉందా?

కాగ్ ఎంట్రీకి అవకాశం ఉందా?

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) ద్వారా ఆడిట్ జరిపించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వంటి కొందరు ప్రముఖులు ఈ విషయాన్ని లేవనెత్తారు. కాగ్ ద్వారా ఆడిట్ జరిపించడం వల్ల ఎప్పుడు? ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నాయనే విషయం బహిర్గతమౌతుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమౌతోంది. ఈ దిశగా టీటీడీ పాలకమండలి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.

ఏ నిర్ణయం తీసుకున్నా వివాదమయమే

ఏ నిర్ణయం తీసుకున్నా వివాదమయమే

నిజానికి- రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. తిరుమల పవిత్రతను అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సారథ్యంలోని ప్రభుత్వంపైనా దుష్ప్రచారం తీవ్రమైన విషయం తెలిసిందే. ఇదివరకు తిరుమలలో చర్చిని నిర్మిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వదంతులను పుట్టించారు. తీరా అది చర్చి కాదని, అటవీ శాఖ ఔట్ పోస్ట్ అని, అక్కడి సీసీటీవీ కెమెరాలను అమర్చడానికి ఏర్పాటు చేసిన స్తంభాన్ని శిలువగా దుష్ప్రచారం చేశారనేది తేలిపోయింది.

Recommended Video

TTD Temple Lands Sale Cancelled | AP CM Jagan Serious on TTD Officials
 రాజకీయ రంగు..

రాజకీయ రంగు..

జగన్ సర్కార్‌పై జరుగుతోన్న మతపరమైన దాడికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటి పరిణామాల మధ్య టీటీడీ పాలక మండలి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా.. అది రాజకీయ రంగును పులుముకుంటోంది. చంద్రబాబు హయాంలోనూ ఆస్తుల అమ్మకాలు చోటు చేసుకున్నప్పటికీ.. అది మరుగున పడిపోతోంది. తాజాగా టీటీడీ పాలక మండలి ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, వేతనాల సమస్య, ఆలయంలో భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వడం వంటి అంశాలు తాజాగా భేటీలో ప్రస్తావనకు రానున్నాయి.

English summary
Tirumala Tirupati Devasthanams (TTD) to conduct General body meeting through video conference on Thursday. TTD Chairman YV Subbareddy will lead the meeting. The TTD Trust board will take key decisions after sale of TTD unviable properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X