తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో అక్కడ స్నానం చేసి శ్రీవారిని దర్శించుకోండి, పాపాలు పోతాయి, ఆ రోజు ముక్కోటి ప్రత్యేకత !

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత చూడవలసిన ఎంతో ముఖ్యమైన పవిత్రమైన ప్రాంతాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అలాంటి పవిత్రమైన ప్రాంతాల్లో తంబురు తీర్థం ఒక్కటి.

|
Google Oneindia TeluguNews

తిరుమల/తిరుపతి: కలియుగ ధైవం శ్రీఏడుకొండలస్వామిని దర్శించుకుంటే చాలు అని కోట్లాది మంది హిందువులు అనుకుంటారు. తిరుమల చేరుకుంటున్న భక్తులు క్యూలైన్లలో గంటలు గంటలు నిలబడి శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చి లడ్డూలు తీసుకుని తరువాత తిరుగు ప్రయాణం గురించి ఆలోచిస్తారు. అయితే తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత చూడవలసిన ప్రాంతాలు. ఎంతో ముఖ్యమైన పవిత్రమైన ప్రాంతాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అలాంటి పవిత్రమైన ప్రాంతాల్లో తంబురు తీర్థం ఒక్కటి. ఆ రోజు మీరు తుంబురు తీర్థంలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటే మీ కష్టాలు తీరుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

TTD: తిరుమలలో గదలు ఇక ముందు ఇలాగే ఇస్తారు, నెలకు ఎన్నిసార్లు అంటే, లడ్డూలకు రూల్స్ !TTD: తిరుమలలో గదలు ఇక ముందు ఇలాగే ఇస్తారు, నెలకు ఎన్నిసార్లు అంటే, లడ్డూలకు రూల్స్ !

తిరుమలలో శ్రీవారి ఆలయానికి 7 మైళ్ల దూరంలో !

తిరుమలలో శ్రీవారి ఆలయానికి 7 మైళ్ల దూరంలో !

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసివున్న శ్రీతుంబురుతీర్థముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 6వ తేదీన జరుగనుంది.

పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈతీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 ముఖ్యమైనతీర్థాలు ఉన్నాయి.

సర్వపాపాలు తొలగిపోతాయి

సర్వపాపాలు తొలగిపోతాయి

అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార,తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవతీర్థాలు. ఈతీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం.


ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడుతుంబురుతీర్థముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ.

అక్కడ స్నానం చేసి దానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటే !

అక్కడ స్నానం చేసి దానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటే !

ఈ పర్వదినానతీర్థస్నానం ఆచరించి, దానధర్మాలు చేసి తిరుమలలో స్వామివారిని శ్రీవెంకటేశ్వరస్వామి భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించేతుంబురుతీర్థముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొంటారు.

ఆర్ టీసీ బస్సులు, టీటీడీ బస్సులు

ఆర్ టీసీ బస్సులు, టీటీడీ బస్సులు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఎక్కువగా ఆకాశగంగా, పాపవినాశం చూసి వెళ్లిపోతుంటారు. అయితే తిరుమలలో తుంబురు తీర్థం అనే ముఖ్యమైన పవిత్రమైన స్థలం ఉందని చాలా మందికి తెలీదు. ఈ ప్రాంతానికి ఆర్ టీసీ బస్సులతో పాటు టీటీడీ ఉచిత బస్సు సర్వీసులు ఉన్నాయి. ఏప్రిల్ 6వ తేదీ పౌర్ణమి రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తుతు కచ్చితంగా తుంబురు తీర్థంలో స్నానం చేసి పవిత్రంగా స్వామి వారిని దర్శించుకోంటే వారికే మంచిది. పౌర్ణమి రోజు అలా చేస్తే భక్తుల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

English summary
TTD: Tumburu Theertha Mukkoti Utsav in Tirumala on the full moon day of 6th April 2023.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X