వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పృథ్వీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్: టాలీవుడ్ నుండి వారి జోక్యం: విజిలెన్స్ విచారణలో..!

|
Google Oneindia TeluguNews

ఎస్వీబీసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తూ..తన పైన వచ్చిన ఆరోపణలతో పదవికి రాజీనామా చేసిన పృథ్వీ వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆదివారం ఈ వ్యవహారం పైన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీని పైన విచారణ నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు ఎస్వీబీసీతో పాటుగా పని చేసే సిబ్బంది వద్ద పృథ్వీ గురించి ఆరా తీస్తున్నారు. అయితే, ఇదే సమయంలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. వైరల్ అయిన పృథ్వీ ఆడియో పైన విజిలెన్స్ ఫోకస్ చేసింది. పృథ్వీ వాయిస్ ను ఫోరెన్సిక్ పంపారు. అయితే, వేధింపుల పైన ఎటువంటి కేసు నమోదు కాలేదు. విజిలెన్స లో క్లీన్ చిట్ వచ్చిన తరువాత తిరిగి బాధ్యతలు చేపడతానని పృథ్వీ చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది.

పృథ్వీ వ్యవహారంలో విజిలెన్స్ విచారణ..
ఒక మహిళతో ఆడియో టేపుల వ్యవహారంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేసారు. ఈ వ్యవహారం పైన విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. దీని పైన ఇప్పటికే ఆ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది తో పాటుగా పృథ్వీ ఛైర్మన్ అయిన తరువాత ఉద్యోగాలు పొందిన వారి నుండి విజిలెన్స్ వివరాలు సేకరిస్తోంది. అయితే, ఆడియోలో పృథ్వీ మాటలు వైరల్ అయినా..ఆ వ్యవహారంలో ఇప్పటి వరకూ ఏ మహిళా కేసు నమోదు చేయకపోవటంతో విచారణలో ముందుకెళ్లటం విజిలెన్స్ కు ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో ఆడియోలో వాయిస్ తనది కాదని పృథ్వీ చెబుతుండటంతో..ఆ ఆడియోను విజిలెన్స్ అధికారు లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారం పైన తాను పోలీసులకు ఫిర్యాదు చేసానని పృథ్వీ చెప్పుకొచ్చారు. కానీ, తిరుపతి పరిధిలో పృథ్వీ ఎటువంటి కేసు నమోదు చేసినట్లుగా సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.

TTD vigilence wing Identified the involvement of tollywood hair stylist in Prudhvi issue

టాలీవుడ్ నుండి ఆ ఇద్దరు..
ఎస్వీబీసీ ఛైర్మన్ గా ఉన్న సమయంలోనే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పృథ్వీ ఇద్దరు మహిళలను టాలీవుడ్ నుండి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఆ ఇద్దరూ మహిళా హెయిల్ స్టైలిస్టులను తీసుకొచ్చినట్లుగా గుర్తించారని సమాచారం. అందులో ఒకరి పాత్ర పైన విజిలెన్స్ ఆరా తీస్తోంది. ఆ మహిళ ప్రమేయం గురించి పూర్తి స్థాయలో సమాచారం సేకరిస్తున్నట్లుగా సమాచారం. తొలుత పృథ్వీ వారిని కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు కల్పించారు. ఆ తరువాత అక్రమ పద్దతిలో నియమకాలు జరిగాయనే కారణంగా ఉద్యోగాలు తొలిగించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఆ ఇద్దరూ ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో ఆ పోన్ కాల్ లో ఎక్కడా పృథ్వీ మహిళను వేధిస్తున్నట్లుగా లేదనే వాదన మరొకటి తెర మీదకు వచ్చింది. దీంతో..ఇప్పుడు విజిలెన్స్ బోర్డుకు సమర్పించే నివేదిక కీలకం కానుంది. ఆ నివేదిక ఆధారంగా పృథ్వీ చెప్పిన అంశాల్లో వాస్తవాలెంత అనేది తేలిపోనుంది. ఈ నివేదిక పైనా ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది.

English summary
TTD vigilence wing is reportedly in a confused state over probe in to the Prudhvi issue.Identified the involve ment of hair stylist from tollywood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X