రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజాస్వామ్యంపై అత్యాచారం, జాతికి అవమానం: తులసి

|
Google Oneindia TeluguNews

Tulasi Reddy
రాజమండ్రి: ప్రజాస్వామ్యంపై అత్యాచారం జరిగిందని జై సమైక్యాంధ్ర పార్టీ నేత తులసిరెడ్డి అన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఆ పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుజాతికి అపచారం, అవమానం జరిగిందని అన్నారు. రాష్ట్ర విభజనతో ప్రజాస్వామ్యంపై అత్యాచారం జరిగిందని చెప్పారు. సమైక్య వ్యవస్థపై హత్యా ప్రయత్నం జరిగిందని వ్యాఖ్యానించారు.

ఈ అవమానం అత్యాచారం, హత్యాయత్నం ఎవరు చేశారని ప్రశ్నించిన ఆయన, దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటులోనే ఇవన్నీ జరిగాయని ఆరోపించారు. దీనికి దుష్ట చతుష్టయం సహకరించిందని, అది ఎవరంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలే అని అన్నారు.

తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే ముఖ్యమంత్రి పదవిని కిరణ్ కుమార్ రెడ్డి వదులుకున్నాడని చెప్పారు. తెలుగుజాతికి 2500ఏళ్ల చరిత్ర ఉందని తులసి రెడ్డి చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి, అభిమానానికి ప్రతీక అని ఆయన తెలిపారు. తెలుగుజాతి ఎంతో మంది మేధావులను, స్వాతంత్ర్యాన్ని సమరయోధుల్ని దేశానికి అందించిందని చెప్పారు.

తెలుగు జాతి ఔన్నత్యం కోసమే మా పార్టీ: పితాని

తెలుగుజాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకే జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భవించిందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. తమ పార్టీ రాజకీయ పార్టీ కాదని ఉద్యమ పార్టీ అని ఆయన చెప్పారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పార్టీ సభలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు ఖూనీ చేశాయని ఆరోపించారు.

ప్రపంచంలోని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పడిందని ఆయన చెప్పారు. దేశ సమగ్రతను, రాష్ట్ర సమైక్యతను కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తామని పితాని సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజన జరగలేదని చెప్పిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను తాను నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Jai Samaikyandhra leader Tulasi Reddy on Wednesday fired at Congress Party against state bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X