విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్! చెప్పేందుకే నీతులా? అంత డబ్బెక్కడిది?: తులసిరెడ్డి విమర్శలు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి జనసేన పార్టీపై, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు: ప్రమాదమంటూ పోలీసుల అనుమతి నిరాకరణధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు: ప్రమాదమంటూ పోలీసుల అనుమతి నిరాకరణ

 నీతులు చెప్పేందుకేనా.. పవన్

నీతులు చెప్పేందుకేనా.. పవన్

తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన జనసేన కవాతును.. ధనసేన కవాతు అంటే బాగుండేదేమోనని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. కవాతులో హెలికాప్టర్ల నుంచి పూల వర్షం, ప్రత్యేక విమానాలు వంటివన్నీ చూస్తుంటే నీతులు చెప్పేందుకే ఉన్నాయనిపిస్తోందని తులసిరెడ్డి విమర్శించారు.

హంగామాలకు డబ్బులెక్కడివి?

హంగామాలకు డబ్బులెక్కడివి?

శ్రీకాకుళం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నుంచి పూలు చల్లించుకుంటున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. పేదల పార్టీకి ఈ హంగామాలకు డబ్బులెక్కడివని తులసిరెడ్డి ప్రశ్నించారు.

 బీజేపీ శని.. టీడీపీ, వైసీపీ రాహు, కేతువులు

బీజేపీ శని.. టీడీపీ, వైసీపీ రాహు, కేతువులు

ప్రజలు బీజేపీని శని గ్రహంగా, టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాహువు, కేతువుగా చూస్తున్నారని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిశ్శబద్ధ విప్లవం కొనసాగుతోందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు

కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు

సీడబ్ల్యూసీలో తీర్మానం చేసిన రైతు రుణమాఫీ, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం, ఏడాదికి 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు, డ్వాక్రా రుణమాఫి వంటి పథకాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే రైతు రుణమాఫీ చేశామని, అందువల్లే కాంగ్రెస్ పార్టీ మళ్లీ చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని తులసిరెడ్డి చెప్పారు.

English summary
Andhra Pradesh Congress Vice President Tulasi Reddy on Monday lashed out at Janasena President Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X