హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపులతో టివి నటుడి భార్య ఆత్మహత్య, భర్త అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 TV actor held for wife's suicide
హైదరాబాద్: అదనపు కట్నం తేవాలంటూ ఓ టివి నటుడు తన భార్యను వేధించగా, వాటిని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతికి సంబంధించిన కేసులో పోలీసులు ఆర్టిస్టు అయిన భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది.

పలు సీరియళ్లలో నటిస్తున్న టివి నటుడికి జీవిత అనే ఇరవై నాలుగేళ్ల యువతితో 2011 అక్టోబర్ 9న పెళ్లైంది. పెళ్లి సమయంలో జీవిత తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో ముట్టజెప్పారు. పెళ్లయ్యాక దంపతులు వెంకటగిరిలో నివాసముంటున్నారు.

పెళ్లైన మూడు నెలల నుండే భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. రెండు నెలలుగా ఆ వేధింపులు ఎక్కువయ్యాయి.

భర్త వేధింపులు తట్టుకోలేక జీవిత శుక్రవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆమెను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుండి భార్య తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. భార్యాభర్తలు ఇటీవలె తమ వివాహ దినోత్సవాన్ని జరుపుకునేందుకు యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరిగి వచ్చాక ఈ ఘటన జరిగింది.

మరోవైపు తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడే హత్య చేశాడని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసుగల కూతురు ఉంది.

English summary
A TV actor was taken into custody by the Jubilee Hills police after his wife committed suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X