వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఇంటి ఎదుట ధర్నా: టీవీ యాంకర్ శ్వేత అరెస్ట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

TV anchor protests in Delhi, arrested
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం ముందు ధర్నా చేసినందుకు ఓ మహిళా టీవీ యాంకర్ కూడా అరెస్టయ్యారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్లను తెలంగాణలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ టీవీ యాంకర్ శ్వేత ఢిల్లీలోని కేసీఆర్ నివాసం ముందు ధర్నా చేశారని సమాచారం.

ముఖానికి నల్లటి గుడ్డ కట్టుకొని, చేతిలో ప్లకార్డు పట్టుకొని ఆమె మౌన ప్రదర్శనతో నిరసన తెలిపారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, తెలంగాణలో ఐబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసరారాల పైన నిషేధం ఎత్తివేయాలని కోరుతూ పలువురు మీడియా ప్రతినిధులు శనివారం తుగ్లక్ రోడ్డులోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం ముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు సాగిన ఈ నిరసన కార్యక్రమంలో మీడియాను రక్షించండి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని నినాదాలు చేశారు.

విలేకరులు నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు తెలియజేసే మీడియా గొంతు నొక్కడం సమంజసం కాదని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ప్రధాన మార్గం వద్ద విలేకరులు ధర్నా చేస్తుండటంతో సీఎంను కలిసేందుకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వెనుక వైపు ద్వారం నుంచి లోనికి వెళ్లాడు. తెరాస ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ ధర్నా చేస్తున్న విలేకరుల వద్దకు వచ్చారు. విలేకరులు ప్రశ్నించగా.. చర్చిద్దామని వారు లోపలకు వెళ్లారు. కాగా, కేసీఆర్ ప్రధానమంత్రిని కలవాల్సిన సమయం దగ్గర పడడంతో... వెనుక ద్వారం నుంచి బయటకు వెళ్లిపోయారని సమాచారం.

English summary
TV Anchor was taken into custody as a preventive measure while she was protesting in front of Chief Minister K Chandrashekar Rao's residence in New Delhi against the alleged ‘ban’ on the broadcast of TV9 and ABN channels. The anchor was staging a silent protest covering her face with a black cloth and was carrying a placard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X