వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్‌లో చిక్కిన టీవి ఆర్టిస్టు విజయరాణి?

By Pratap
|
Google Oneindia TeluguNews

TV artist Vijayarani arrested in Bangalore
హైదరాబాద్: చిట్టీల పేరుతో ఏడు కోట్ల రూపాయల మేరకు తోటి కళాకారులను, స్థానికులను ముంచి టీవి ఆర్టిస్టు విజయరాణి ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఆమెను కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో అరెస్టు చేసినట్లు తెలుగు టీవి న్యూస్ చానెళ్లలో వార్తలు వచ్చాయి. నెల రోజులుగా ఆమె తప్పించుకుని తిరుగుతున్నారు. ఆమెతో పాటు మరో పదిమందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

తెలుగు టీవీ నటి విజయరాణి రూ. 7 కోట్ల మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో విజయరాణి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర భారీ మొత్తం డబ్బు వసూలు చేస్తూ వస్తోంది. కొన్నేళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తుండటంతో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఆమె వద్ద డబ్బు పోగేసుకుంటున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తన వద్ద జమైన రూ. 7 కోట్ల డబ్బుతో విజయరాణి ఉడాయించింది. మరికొందరు ఈ డబ్బు రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.

విజయరాణి ఆచూకీ లేక పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జూనియర్ ఆర్టిస్టులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. రాత్రింభవళ్లు కష్టపడి పిల్లల భవిష్యత్ కోసం చిట్టీలు వేస్తున్నామని, విజయరాణి ఇలా మోసం చేస్తుందని ఊహించలేదని బాధితులు గగ్గోలు పెట్టారు.

విజయరాణి సామాన్లు కూడా తీసుకుని లారీలో పారిపోయినట్లు భావించారు. ఆమె బ్యాంక్ ఖాతాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

English summary
According to media reports - TV artist Vijayarani has been nabbed by police in Bangalore for cheating co - artists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X