వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ నేతలకు టీవీ కష్టాలు..! డిబేట్లలో కనిపిస్తే డిబార్ చేస్తానని కేసీఆర్ వార్నింగ్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీవీ షోలో పాల్గొని కాస్త ప్రాచూర్యం పొందొచ్చు అని అనుకుంటున్న గులాబీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు వాఖ్యలు శరాఘాతంలా పరిణమించాయి. వివిధ వార్తా ఛానళ్లలో వచ్చే చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించే క్రమంలో గులాబీ నేతలు తడబడుతున్నారని, అందుకు ప్రభుత్వానికి కనిపించని నష్టం జరుగుతోందని గాలాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

టీవి చర్చా వేదికల్లో సరైన సమాచారం లేకుడా, ఆధారాలు చూపించే కసరత్తు చేయకుండా టీవి చర్చా కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, అసలు పార్టీ ముఖ్యనేతలకు సమాచారం ఇవ్వకుండా ఎవరు కూడా చర్చా కార్యక్రమాల్లో పాల్లొన కూడదని గులాబీ బాస్ ఆదేశాలు కూడా జారీ చేసారు. టీవి ఛానళ్లో లో చర్చల్లో ఎవరూ పాల్గొనాలో పార్టీ నిర్ణయిస్తుందని, వార్తా ఛానళ్ల కార్యాలయాలనుంచి ఫోన్లు రాగానే ఎవరూ కూడా పాల్గొన వద్దని నేతలకు సీఎం చంద్రశేఖర్ రావు గ్లి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అత్యుత్సాహంతో పార్టీ తరపున టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పార్టీ నాయకులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారట.

Recommended Video

నూతన సచివాలయానికి కేసీఆర్ భూమి పూజ
TV woes for pink leaders ..! KCR Warning that Debars will appear in Debates .. !!

తన ఆదేశాలను ఉల్లంఘించి వ్యవహరిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు సమాచారం. కాగా వచ్చే నెలలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నామని, ఇందుకోసం పార్టీ నాయకులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. మున్సిపల్‌ ఎన్నికలను ఎంత వీలైతే అంత వేగంగా పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పూర్తయితే అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

English summary
Telangana CM KCR party leaders have reportedly said that if anyone tries to participate in TV talk shows on behalf of the party, the actions will be strict and will be suspended from the party if necessary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X