వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

65 అయితే 88 ఎలా : 140, మొత్తం 175, ఇదీ విజయసాయి, లక్ష్మీనారాయణ సీట్ల లెక్కల యుద్ధం

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీలో వైసీపీ, జనసేన మధ్య సీట్ల లెక్కల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జనసేన విశాఖపట్టణం లోక్ సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ మధ్య లెక్కల అంశంపై శుక్రవారం ట్వీట్ల వార్ జరిగింది. ఒకరికొకరు పరస్పరం వ్యక్తిగత దూషణలకు వెళ్లేవరకు ట్వీట్ల యుద్ధం కంటిన్యూ అయ్యింది.

tweet war between ycp and janasena

65 అయితే 88 ఎలా
ఏపీలో జనసేన పోటీచేసింది 65 స్థానాల్లో .. కానీ పవన్ అనుచరుడు లక్ష్మీనారాయణ 88 స్థానాల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని చెప్తున్నాడు. ఇదివరకు దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇదేవిధంగా లేనివి ఉన్నట్టు రాశాడా ? ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా అని లక్ష్మీనారాయణపై .. విజయసాయి ట్వీట్లలో సెట్లైర్లు వేశారు.

అన్నీ కలిపి 175 ?
విజయసాయి సెటైర్లకు లక్ష్మీనారాయణ ధీటుగానే స్పందించారు. రాష్ట్రంలో జనసేన 140 స్థానాల్లో పోటీ చేసింది. మిత్రపక్షాలు బీఎస్పీ, సీపీఐ, సీపీఎం 14 .. మొత్తం 175 స్థానాల్లో కూటమి బరిలోకి దిగింది. సీట్లకు సంబంధించిన లెక్కలు కచ్చితంగా ఉన్నాయి. అని విజయసాయికి ట్వీట్టర్ వేదికగా లక్ష్మీనారాయణ చురకలంటించారు.

ఇకనైనా లెక్కలు నేర్వండి
పనిలోపనిగా విజయసాయి క్వాలిఫికేషన్ కూడా ప్రస్తావించారు. సీఏ చదివినా మీ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో అర్థం కావడం లేదు. ముందు మీ లెక్కలు సరిచూసుకోండి అని సూచించారు. మేం సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్లమని గుర్తుచేశారు లక్ష్మీనారాయణ. కానీ మీరు వేసిన తప్పుడు లెక్కలతో ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారని విమర్శించారు. ఇకనైనా లెక్కలు నేర్చే విధానాన్ని ప్రారంభించండి అని హితవు పలికారు.

English summary
In AP, the battle between the ycp and Janesena continues. The Tweets war fought on Friday between the Vijaya sai reddy and Jena's Visakhapatnam Lok Sabha candidate VVS Lakshminarayana. The Battle of Tweets continued until each other went to mutually indiscriminate accusations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X