• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

|

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగుమతులు నిలిచిపోవడంతో చాలా రాష్ట్ర్రాల్లో నిత్యావసరాల కొరత కొనసాగుతోంది. ఇదే పరిస్ధితి మరికొన్ని రోజులు కొనసాగడం తథ్యమని తేలిపోవడంతో కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్రం సూచనల మేరకు దక్షిణ మధ్య రైల్వే ఏపీ నుంచి రెండు కార్గో రైళ్లను ఢిల్లీకి పంపింది.

 ఏపీ నుంచి ఢిల్లీకి రెండు రైళ్లు..

ఏపీ నుంచి ఢిల్లీకి రెండు రైళ్లు..

ఏపీ నుంచి కరోనా లాక్ డౌన్ వేళ రైళ్ల రాకపోకలు కొనసాగించడం కష్టం. కానీ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ లో నిత్యావసర వస్తువుల కొరత కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఇక్కడ చిక్కుకుపోయారు. దీంతో వీరి కోసం ఏపీ లోని రేణిగుంట, గుంతకల్ స్టేషన్లతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బోగీలు కలుపుకుని హజరత్ నిజాముద్దీన్ కు ఇవాళ రెండు కార్గో ఎక్స్ ప్రెస్ రైళ్లు బయలుదేరి వెళ్లాయి.

దూద్ దురంతో ప్రత్యేక రైళ్లు..

దూద్ దురంతో ప్రత్యేక రైళ్లు..

దేశవ్యాప్తంగా పాసింజర్ రైలు సర్వీసులు నిలిచిపోయినా అత్యావసర సరుకుల కొరత నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే దేశంలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక కార్గో రైళ్లను మాత్రం నడుపుతోంది. ఇందులో భాగంగా దూద్ దురంతో పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన రెండు రైళ్లలో ఇవాళ ఏపీ నుంచి 2.4 లక్షల లీటర్ల పాలు, 23 టన్నుల మామిడి పళ్లు, మరో 23 టన్నుల బూడిద గుమ్మడి కాయలను ఢిల్లీకి పంపారు. ఉదయం 8 గంటలకు చిత్తూరులోని రేణిగుంట స్టేషన్లో పాల ట్యాంకర్లు, మామిడిపండ్లతో బయలుదేరిన ఈ రెండు రైళ్లు... మార్గమధ్యంలోని గుంతకల్ లో బూడిద గుమ్మడి కాయలను నింపుకుంటాయి. ఒక రైలు సికింద్రాబాద్ లో మామిడి పళ్లను నింపుకుంటుంది.. రెండు రైళ్లలోనూ ఒక్కొక్కటీ 40 వేల లీటర్ల సామర్ధ్యమున్న ఆరు పాల ట్యాంకర్లతో పాటు పార్శిల్ వ్యాన్లు (బోగీలు) కూడా ఉన్నాయి.

దూద్ దురంతో రైళ్ల ప్రత్యేకతలివే..

దూద్ దురంతో రైళ్ల ప్రత్యేకతలివే..

ఈ రెండు రైళ్లు కూడా అవిశ్రాంతంగా 36 గంటల పాటు ప్రయాణించి రేపు రాత్రి కల్లా ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ కు చేరుకుంటాయి. వీటికి ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించేందుకు వీలుగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దూద్ దురంతో రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లతో సమానంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు.

రోజుకు సగటున 180 గూడ్స్ రైళ్లు..

రోజుకు సగటున 180 గూడ్స్ రైళ్లు..

ప్రస్తుత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో తలెత్తిన పరిస్ధితుల కారణంగా రోజుకు 180 గూడ్స్ రైళ్లను వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. వీటిలో దూద్ దురంతో రైళ్లు ఇంకాస్త ప్రత్యేకమైనవి. అయితే అన్ని రవాణా రైళ్లలోనూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్ర్తత్యేక శానిటైజేషన్ తో పాటు సిబ్బంది సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తి జరగదని అధికారులు చెప్తున్నారు.

English summary
SCR runs “Doodh Duronto Special” along with Two Parcel Vans from Renigunta to H. Nizamuddin Enabled successful transportation of 2.4 lakh liters of Milk, 23 tonnes of Mangoes and 23 tonnes of Muskmelons In its continuous effort to ensure uninterrupted supply of essential commodities during the Nationwide Lockdown imposed to contain the spread of COVID-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X