విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నదిలో పడిపోవడం చూసి: బోటు ప్రమాదంలో వీరిద్దరే హీరోలు, ప్రయత్నించినా కొందరు కొట్టుకుపోయారు

కృష్ణా నదిలో పడవ బోల్తా పడినప్పుడు ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడారు. ఇద్దరే పద్నాలుగు, పదిహేను మంది ప్రయాణీకులను కాపాడారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: కృష్ణా నదిలో పడవ బోల్తా పడినప్పుడు ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడారు. ఇద్దరే పద్నాలుగు, పదిహేను మంది ప్రయాణీకులను కాపాడారు.

<strong>బోటు ప్రమాదంలో కొత్త కోణాలు: నిలిపేసినా.. ఎన్నో షాకింగ్ విషయాలు</strong>బోటు ప్రమాదంలో కొత్త కోణాలు: నిలిపేసినా.. ఎన్నో షాకింగ్ విషయాలు

 ఇద్దరికీ చంద్రబాబు బహుమతి

ఇద్దరికీ చంద్రబాబు బహుమతి

వారిద్దరే శివయ్య, పిచ్చయ్య. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిద్దరిని ప్రశంసించారు. వారికి చెరో రూ.5 లక్షల బహుమతిని ప్రకటించారు.

 వేట సాగిస్తున్న మత్స్యకారులు

వేట సాగిస్తున్న మత్స్యకారులు

బోటు బోల్తా పడినప్పుడు మత్స్యకారులు వేట సాగిస్తున్నారు. భవానీపురం వైపు పడవల్లో వస్తున్నారు. ఇంతలో ప్రయాణీకులతో వెళ్తున్న రివర్ బోటింగ్ సంస్థకు చెందిన బోటు కుదుపులకు లోనయింది. ఇసుక మేటను ఢీకొట్టింది. ఓ వైపుకు ఒరిగిపోయింది. మరపడవల్లో వస్తున్న మత్స్యకారులు దీనిని గమనించారు.

కొందరు నదిలో పడిపోవడం చూశారు

కొందరు నదిలో పడిపోవడం చూశారు

వారిలో పిచ్చయ్య, దుర్గారావు (శివయ్య) అనే ఇధ్దరు మత్స్యకారులు గుర్తించారు. ఇంజిన్ సమస్య వచ్చి బోటు కదలాడుతుందని గుర్తించి, ఆటు వెళ్లారు. బోటు ఓ వైపు ఒరిగిపోతూ ఉండటం, కొందరు నదిలో పడిపోతుండటం చూశారు.

 ఆర్తనాదాలు విన్నారు

ఆర్తనాదాలు విన్నారు

బోటులో ప్రయాణీకుల ఆర్తనాదాలు వారు విన్నారు. వెంటనే వారిద్దరు మరింత వేగంగా తమ బోట్లను అటు వైపు తిప్పారు. తిరగబడిన బోటు దగ్గరగా పోనిచ్చి, అందిన వాళ్లను అందినట్లుగా తమ పడవల్లో ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చారు.

 ఇద్దరినీ అభినందించిన చంద్రబాబు

ఇద్దరినీ అభినందించిన చంద్రబాబు

సోమవారం సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు వారిద్దరిని పిలిపించి మాట్లాడారు. వారిని అభినందించడమే కాకుండా, వారికి రివార్డ్ ప్రకటించారు. కాగా,

 కళ్ల ముందే కొట్టుకుపోవడం బాధించింది

కళ్ల ముందే కొట్టుకుపోవడం బాధించింది

బోటులో నుంచి నీళ్లలోకి జారిపోతున్న వారిని శివయ్య, పిచ్చయ్యలు తెగువతో కాపాడారని, అది తమను కదిలించిందని ఓ వ్యక్తి చెప్పారు. బోటు అటూ ఇటూ ఊగుతున్నట్లు కనిపించిందని, లోపల ఉన్న వాళ్లు పెద్దగా కేకలు వేయడం గుర్తించామని, తాము ఎంత ప్రయత్నించినా, కొందరు కొట్టుకుపోవడం బాధించిందని కలిగించిందని పిచ్చయ్య, శివయ్యలు అన్నారు.

English summary
Two fishermen saved many lives in boat capsized in Vijayawada, Krishna District on Sunday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X