వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

23వ తేదీ ఎఫెక్ట్ : ఏపీలో రాజ‌కీయ క్యాంపులు త‌ప్ప‌వా: రెండు పార్టీల్లోనూ సీనియ‌ర్ల‌కు బాధ్యులు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో క్యాంపుల రాజ‌కీయం త‌ప్ప‌దా. అవ‌స‌రం ఉన్నా...లేకున్నా 23వ తేదీ పోలింగ్ నాటికి మాత్రం క్యాంపులు ఏర్పాటు చేసుకోవాల‌ని టీడీపీ..వైసీపీ ఆలోచ‌న చేస్తున్నాయి. ఇందు కోసం ముందుగానే పోటీలో ఉన్న అభ్య‌ర్దుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు నాడు మాత్రం అభ్య‌ర్దులను చూసుకొనే బాధ్య‌త‌ల‌ను పార్టీ సీనియ‌ర్ల‌కు అప్ప‌గిస్తున్నారు.

అభ్య‌ర్దుల‌తో క్యాంపులు..
23వ తేదీన ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. వైసీపీ .. టీడీపీ గెలుపు పైన ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. తాము లాండ్ స్టైడ్ విక్ట‌రీ సాధిస్తామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ధీమాగా ఉన్నారు. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం తాను అనేక రకాలుగా స‌ర్వేలు చేయించాన‌నేఇ..డ్వాక్రా మ‌హిళ‌ల్లో 60 శాతం ఓట్లు టీడీపీకే వేసార‌ని విశ్లేషిస్తున్నారు. గెలుపు ఖాయ‌మ‌ని చెబుతున్నా.. హోరా హోరీ పోరు జ‌రిగింద‌ని అంగీక‌రిస్తున్నారు.

Two main political parties preparing for conduct political camps in AP after results..

ఇదే స‌మ‌యంలో మెజార్టీకి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి..ఎమ్మెల్యేల సంఖ్య త‌గ్గితే రాజకీయం రంజుగా మార‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే రెండు పార్టీలు ఫ‌లితాల ముందే అభ్య‌ర్దుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. త‌మ పార్టీలోని అభ్య‌ర్దుల‌ను బీజేపీ..వైసీపీ న‌యానో..భ‌యానో త‌మ వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాయ‌ని టీడీపీ నేత‌లు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు. దీంతో..ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని న‌మ్మ‌కం ఉన్న ఎమ్మెల్యేలతో టీడీపీ నిత్యం ట‌చ్‌లో ఉంటోంది.

21న జ‌గ‌న్ కీల‌క స‌మావేశం...
టీడీపీ ఆలోచ‌న ఆ విధంగా ఉంటే..వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం ఎక్క‌డా హ‌డావుడి లేకుండా జాగ్ర‌త్త‌గా త‌న వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. అందులో భాగంగా..ఇప్ప‌టికే లోట‌స్ పాండ్ నుండి కార్యాల‌యం మొత్తం విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. అక్క‌డే ఈ నెల 21న పోటీలో ఉన్న ఎంపీ..ఎమ్మెల్యే అభ్య‌ర్దుల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసారు. ఆ రోజు పోలింగ్ స‌ర‌ళి పైన త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన నివేదిక‌ల‌ను అభ్య‌ర్దుల ముందు జ‌గ‌న్ వివ‌రించ‌నున్నారు.

Two main political parties preparing for conduct political camps in AP after results..

గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా పార్టీ కోసం ప‌ని చేసే ప్ర‌తీ ఒక్క‌రికీ గుర్తింపు ఉంటుంద‌ని జ‌గ‌న్ దిశా నిర్దేశం చేయ‌నున్నారు. అదే విధంగా..టీడీపీ కొంత కాలంగా ఫ‌లితాల పైన చేస్తున్న ప్ర‌చారం పైనా జ‌గ‌న్ స్పందిస్తారు. ఇక‌, 23న ఫ‌లితాల రోజు అభ్య‌ర్దులంతా పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంతో ట‌చ్‌లో ఉండాల‌ని సూచిస్తూనే..ప్ర‌తీ జిల్లాకు ఒక సీనియ‌ర్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియ‌మించ‌నున్నారు. ఫ‌లితాల స‌ర‌ళి పూర్తిగా వెల్ల‌డ‌య్యేంత వ‌ర‌కూ సీనియ‌ర్లు అభ్య‌ర్దుల బాధ్య‌త‌లు తీసుకోనున్నారు.

English summary
Main political parties in AP preparing for Camps with winning candidates on 23rd this month. Parties expecting two main parties will get around 80 seats each. In view of this thinking about political camps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X