వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంలో జగన్ పార్టీ ఎమ్మెల్యే గ్రామం మునక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Two MLAs villages to drown in Polavaram
హైదరాబాద్/ఖమ్మం: పోలవరం బిల్లుకు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఏడు ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తున్నాయి. ఏడు మండలాల్లోని 211 గ్రామాలు ఏపీలో కలుస్తున్నాయి. వీటితో పాటు పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతోంది. ముంపు బాధితుల జాబితాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

అందులో ఒకరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, మరొకరు సీపీఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. సదరు ఎమ్మెల్యేల స్వగ్రామాలు ముంపు ప్రాంతంలో ఉండటంతో వీరు స్థానికేతర సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన సున్నం రాజయ్య భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సీపీఎం నేత. ఇప్పటి వరకు ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన పుట్టి పెరిగింది ముంపు మండలం ఉన్న వీఆర్ పురం(వరరామచంద్రాపురం)లోని సున్నంవారి గూడెం. ఆయనకు సొంతూరిలో పక్కా ఇల్లు ఉంది. ఈ గ్రామంలో సుమారు 500 మంది జనాభా ఉంటుంది. ప్రస్తుతం ఆ గ్రామం అంతా పోలవరం ముంపులోకి చేరిపోనుంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సొంత గ్రామం ముంపు మండలం వేలేరుపాడు. ఈ మండలంలోని తిరుమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నాయికట్ట ఆయన స్వగ్రామం. అక్కడ ఆయనకు ఇంటి స్థలం ఉంది. ఈ గ్రామం కూడా ముంపులోకి చేరిపోనుంది. ఈ గ్రామ జనాభా సుమారు 400.

English summary
Two MLAs villages from Khammam district to drown in Polavaram Project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X