వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలెవరికి? గవర్నర్ కోటా కింద: వైసీపీ వర్గాల్లో మర్రి పేరు జోరుగా

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి. శాసన మండలిలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలు త్వరలో భర్తీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం, గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎంపికైన ఇద్దరు సభ్యుల పదవీ కాలం ముగియడం వల్ల ఖాళీ అయ్యే ఈ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడానికి వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం వడపోతను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

కోయంబేడు ఎఫెక్ట్: హాట్‌స్పాట్‌గా విజయవాడ హోల్‌సేల్ మార్కెట్: మూసివేత..కోయంబేడు ఎఫెక్ట్: హాట్‌స్పాట్‌గా విజయవాడ హోల్‌సేల్ మార్కెట్: మూసివేత..

గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పేరును గవర్నర్ కోటా కింద ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది వైసీపీ వర్గాల్లో మర్రి రాజశేఖర్ పేరు జోరుగా వినిపిస్తోంది. నిజానికి- గత ఏడాది ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మర్రి రాజశేఖర్ చిలుకలూరి పేట స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంది. 2014లో ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసిన పత్తిపాటి పుల్లారావు చేతుల్లో ఓటమి చవి చూశారు. 219 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని మార్చింది. మర్రి రాజశేఖర్‌కు బదులుగా విడదల రజినీని బరిలో దింపింది. ఆ స్థానాన్ని గెలుచుకుంది.

 Two MLC seats in Andhra Pradesh for SC and Muslim communities in Governors quota

Recommended Video

#WATCH Man Marries Both Lover and Bride Chosen by His Family Same Time Viral, Bizarre! || Oneindia

తాను పోటీ చేయాల్సిన స్థానాన్ని విడదల రజిని కోసం వదులుకున్నారు మర్రి రాజశేఖర్. శాసన మండలికి పంపిస్తామంటూ అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా గవర్నర్ కోటా కింద మర్రి రాజశేఖర్ పేరును ప్రతిపాదించవచ్చని అంటున్నారు. దీనిపై వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌ను గవర్నర్ కోటా కింద శాసన మండలికి పంపించడం వల్ల ఆయనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటు సామాజిక సమతుల్యాన్ని పాటించినట్టవుతుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది.

English summary
Two MLC seats in Andhra Pradesh for SC and Muslim communities in Governor's quota. It seems that one of the two vacant seats to be filled in the governor's quota in the Andhra Pradesh Legislative Council will be allotted to SCs and the other to Muslim communities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X