హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో రెండు రోజులు ఆంధ్రా, తెలంగాణాల్లో వర్షాలు...

|
Google Oneindia TeluguNews

ఇప్పటికే వర్షంతో ముంచెత్తున్న వరణుడు మరో రెండు రోజుల పాటు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. దీంతో రానున్న రెండు రోజులు కూడ ఏపీలో మరియు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతవరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడిన ఆల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురువనున్నట్టు ఐఎండీ ప్రకటించింది. ముఖ్యంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం వాయువ్వదిశగా కదలనుండడంతో ఏపీలో కోస్తా తీరంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు.

 బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్‌ సైతం హెచ్చరించింది. బుధవారం కూడ చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఇతర జిల్లాల్లో మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పారు. లొతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావద్దని సూచించారు.

కర్ణాటక, తమిళనాడులో ఎడతెరపి లేని వర్షాలు

కర్ణాటక, తమిళనాడులో ఎడతెరపి లేని వర్షాలు

ఆల్పపీడనం పశ్చిమ బంగాళాఖాతానికి అనుకుని నైరుతి తీరంలోని 5.8 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉండడంతో ఏపీతో పాటు కర్ణాటక ప్రాంతంలో కూడ దీని ప్రభావం ఉన్నట్టు చెప్పారు. తమిళనాడులో కూడ వర్షబీభత్సం కొనసాగుతోంది. సుమారు ఆరు జిల్లాల్లో వర్ష ప్రభావం కనిపిస్తోంది. దీంతో 23 ,24 తేదీల్లో కూడ ఉరుములు, మెరుపులతో వర్షాలు ఆయా రాష్ట్రాల్లో కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో,మధ్య, తూర్పు మరియుు ఈశాన్య భాతరంలో కూడ రెండు రోజుల పాటు వర్షాలు కురువనున్నట్టు తెలిపారు.

 తెలంగాణలో ఇదే పరిస్థితి

తెలంగాణలో ఇదే పరిస్థితి

తెలంగాణలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురువనున్నట్టు వాతవరణ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో గ్రామాల మధ్య రాకపోకలు స్థంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుమురం భీం జిల్లాలోని రణవెల్లి, బోరపెల్లి మధ్య వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.ఇక హైదరాబాద్‌లో కూడ సాయంత్రం అయిందటే కనీసం గంటపాటు వర్షం కురుస్తోంది. దీంతో కార్యాలయాలు, విద్యాసంస్థల నుండి అప్పుడే వస్తున్న విద్యార్థులు,ఉద్యోగులు చాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్థంబించిపోతున్న పరిస్థితి నెలకోంది.

English summary
coastal andra pradesh and telangana also get heavy rains two more coming days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X