వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు పిసిసిలపై డిగ్గీ: తెరాసతో పొత్తు, విలీనం పైనా ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Two PCC chiefs for Andhra Pradesh?
హైదరాబాద్: రాష్ట్రానికి రెండు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలను ఏర్పాటు చేస్తే బాగుంటుందేమోనన్న అభిప్రాయాన్ని ముఖ్య నేత వద్ద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విమానంలో హైదరాబాద్‌కు వస్తూ రాష్ట్రానికి చెందిన పార్టీ నేత ఒకరితో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.

సమాచారం ప్రకారం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రాంత నేతల మాటలను, మరో ప్రాంతం నేతలు వినే పరిస్థితి లేదని, దీని వల్ల పార్టీకి నష్టం చేకూరుతున్నదని దిగ్విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీమాంధ్రకు చెందినవారు కావడంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు.

అదే రెండు పిసిసిలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ఇచ్చిన ఉత్సాహంతో ఆ ప్రాంత నేతలు ప్రజల వద్దకు వెళ్లగలుగుతారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో దిగ్విజయ్‌ను కలిసినప్పుడు ప్రభుత్వ చీఫ్‌ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా ఇదే అంశం లేవనెత్తారు.

రెండు పిసిసిలు ఏర్పాటు చేసే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు గురువారం అసెంబ్లీ లాబీల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు కూడా వ్యాఖ్యానించారట. మరోవైపు రాష్ట్రంలో రెండు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కోరుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు మంచిదా లేక విలీనం చేసుకోవడం మంచిదా అనే ఆలోచనపై కూడా పలువురు నేతలను డిగ్గీ అడిగినట్లుగా సమాచారం. రాబోయే ఎన్నికల్లో తెరాసతో సీట్ల సర్దుబాటు లేదా విలీనం.. ఈ రెండింటిలో ఏది ఉత్తమమో చెప్పాలని తెలంగాణ కాంగ్రెసు నేతలను ప్రశ్నించారు.

English summary
It is said that the AP Congress Party incharge Digvijay Singh asked the Telangana leaders about Two PCCs for Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X