కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపి ఎన్నిక‌లు ర‌క్త‌సిక్తం: ఇద్ద‌రి మృతి..ప‌లువురికి గాయాలు : చెల‌రేగిన టిడిపి..వైసిపి శ్రేణులు..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ర‌క్త‌సిక్త మ‌య్యాయి. ఇంకా పోలింగ్ పూర్తి కాలేదు. ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న అభ్య‌ర్దుల పై దాడులు చేసారు. టిడిపి..వైసిపి అభ్య‌ర్దులు గాయ‌ప‌డ్డారు. వేట కొడ‌వ‌ళ్లు..రాళ్ల‌తో య‌ధేచ్చ‌గా దాడులకు పాల్ప‌డ్డారు. క‌ర్నూలు..క‌డ‌ప‌..అనంత‌పురం..గుంటూరు లోని ప‌ల్నాడు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌నం చోటు చేసుకుంది. అయితే, మ‌రో వైపు పోలింగ్ శాతం భారీగా న‌మోద‌వుతోంది.

20 చోట్ల ఘ‌ర్ణ‌ణ‌లు.. ఇద్ద‌రి మృతి

20 చోట్ల ఘ‌ర్ణ‌ణ‌లు.. ఇద్ద‌రి మృతి

ఏపిలో జ‌రుగుత‌న్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 20 ప్రాంతాల్లో ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్న‌ట్లు ఎన్నిక‌ల సం ఘం అధికారింగా ప్ర‌క‌టించింది. అనంత‌పురం తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని వీరాపురం లో టిడిపి..వైసిపి వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ వేట కొడ‌వ‌ళ్ల‌కు దారి తీసింది. ఈ దాడిలో టిడిపికి చెందిన భాస్క‌ర రెడ్డి..వైసిపికి చెందిన పుల్లా రెడ్డి మ‌ర‌ణించారు. అయితే, ఎన్నిక‌ల సంఘం మాత్రం ఒక‌రు మ‌ర‌ణించిన‌ట్లు ధృవీక‌రించింది. అయితే, ప‌లువురికి తీవ్ర గాయాలు అయిన‌ట్లు వెల్ల‌డించారు. ఇక‌, క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం లో టిడిపి..వైసిపి కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ప‌లు ప్రాంతాల్లో ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. వారిని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు స్వ‌ల్ప లాఠీచార్జ్ చేసారు. ఇక‌, ఖాజీపేట మండ‌ల ప‌రిధిలో టిడిపి అభ్య‌ర్ది రామ‌సుబ్బారెడ్డి కారు పై వైసిపి శ్రేణులు దాడికి దిగారు.

సంచ‌ల‌నంగా మారిన కోడెల వ్య‌వ‌హారం..

సంచ‌ల‌నంగా మారిన కోడెల వ్య‌వ‌హారం..

స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని రాజుపాలెం మండ‌లంలో టిడిపి అభ్య‌ర్ది కోడెల శివ ప్ర‌సాద్ ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లి చొక్క విప్పి త‌లుపులు వేసుకున్నారు. ఆ త‌రువాత వైసిపి నేత‌లు త‌న పై దాడి చేసి గాయ ప‌రిచార‌ని చెబుతు న్నారు. అయితే, కోడెల మాత్రం అక్క‌డ రిగ్గింగ్ జ‌రుగుతుంద‌నే స‌మాచారం తో అక్క‌డికి వెళ్ల‌గా దాడి చేసార‌ని..దీంతో అధికారులు త‌న‌ను లోప‌లికి తీసుకెళ్లి త‌లుపులు వేసినా..వైసిపి కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డార‌ని వివిరించారు. ఇక‌, న‌ర్సరావు పేట టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్ది పై వైసిపి శ్రేణులు దాడి చేసి కారు అద్దాల‌ను ధ్వంసం చేసారు. ఇక‌, వైసిపి అభ్య‌ర్ది గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని టిడిపి శ్రేణులు ధ్వంసం చేసి ఆయ‌న పై దాడికి దిగ‌టం తో చేతికి గాయ‌మైంది.

గుంత‌క‌ల్ లో జ‌న‌సేన అభ్య‌ర్ద వీరంగం..

గుంత‌క‌ల్ లో జ‌న‌సేన అభ్య‌ర్ద వీరంగం..

అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్ లో జ‌న‌సేన అభ్య‌ర్ది మ‌ధుసూధ‌న గుప్తా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఇవియం ను ధ్వంసం చేసారు. ఇక‌, ఒంగోలు లోనూ రెండు పార్టీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. చీరాల లో ఆమంచి అనుచ‌రులు..బ‌ల రాం మ‌ద్ద‌తు దారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. పోలీసులు స‌కాలంలో స్పందించ‌టంతో స‌ద్దుమ‌ణిగింది. గుర‌జాల నియో జ‌క‌వ‌ర్గంలో రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు కొట్టుకున్నారు. ఇక‌, క‌ర్నూలు జిల్లా అహోబిలం లో ట‌డిపి..వైసిపి శ్రేణులు ప‌ర స్ప‌రం రాళ్లు విసురుకోవ‌టం తో ఓట‌ర్లు భ‌య భ్రాంతుల‌కు గుర‌య్యారు. ప్ర‌శాంతంగా ఉండే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఒక గ్రామంలోకి వైసిపి వారిని రాకుండా అడ్డుకోవ‌టంతో..మ‌రో గ్రామంలో టిడిపి..జ‌న‌సేన వారిని రాకుండా వైసిపి మ‌ద్ద తు దారులు అడ్డుగా నిలిచారు.

English summary
AP elections created mote tension in many districts. Two persons died in both parties clash in Tadipatri. Attacks on TDP and YCP candidates in narasarao pet. Stone pelting in Kurnool dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X