వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ శిక్ష‌ణా శిబిరంలో ఇద్దరు ఐఏయ‌స్‌లు : అతిధులా..పార్టీలో చేరుతున్నారా : కీల‌క ప‌దవులు ఖాయం..!

|
Google Oneindia TeluguNews

వైసిపిలోకి మ‌రో ఇద్ద‌రు ఐఏయ‌స్‌లు. పార్టీ శిక్ష‌ణా శిబ‌రంలో క్రియా శీల‌క పాత్ర‌. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ ప్ర‌భుత్వ అవినీతి వ్య‌వ‌హారాల పైనే విమ‌ర్శ‌లు. ఇప్పుడు నేరుగా వైసీపీ స‌మావేశానికి హాజ‌రు. తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే వారికి ప్ర‌భుత్వంలో కీల‌క ప‌దువులు ఇవ్వాల‌ని ఇప్ప‌టికే డిసైడ్ అయ్యారు. అయితే, వారు నేరుగా ఎప్పుడూ జ‌గ‌న్‌తో స‌మావేశం కాలేదు. కానీ, ఈరోజు పార్టీ స‌మావేశంలో పాల్గొనటం ద్వారా..ఇక పార్టీలో అధికారికంగా చేర‌ట‌మే మిగిలింది.

ఆ ఇద్ద‌రు ఐఏయ‌స్‌లు హాజ‌రు..
ఈ నెల 23న జ‌రిగే ఓట్ల లెక్కింపుకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్దులు..వారి ఏజెంట్ల కోసం వైసీపీ శిక్ష‌ణా శిబిరం ఏర్పాటు చేసింది. విజ‌య‌వాడ‌లోని ఒక ఫంక్ష‌న్ హాల్‌లో ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. ఈ శిబిరంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌లు విజ‌య సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వ‌ర్లు కౌంటింగ్ స‌మ‌యంలో ఏర‌కంగా వ్య‌వ‌హ‌రించాలో దిశా నిర్ధేశం చేసారు. అయితే. ఇదే కార్య‌క్ర‌మానికి ఏపి ప్ర‌భుత్వంలో వివిధ హోదాల్లో ప‌ని చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఇద్ద‌రు ఐఏయ‌స్ అధికారులు సైతం పాల్గొన్నారు. అందులో ఒక‌రు జ‌గ‌న్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొని..సీబీఐ విచార‌ణ ఎదుర్కొన్న శామ్యూల్ కాగా, మ‌రొక‌రు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేసి..కొంత కాలంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌ను బ‌హిరంగంగా త‌ప్పు బడుతూ..టీడీపీకి మింగుడు ప‌డ‌కుండా మారిన అజ‌య్ క‌ళ్లాం. ఈ ఇద్ద‌రూ ఇప్పుడు టీడీపీకి వ్య‌తిరేకంగా ఉన్నా..ఏనాడు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌లేదు. ఇప్పుడు నేరుగా పార్టీ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో పాల్గొని ఏజెంట్ల‌కు సూచ‌న‌లు చేయటంతో ఆస‌క్తి క‌ర చ‌ర్చ మొద‌లైంది.

Two Senior IAS officers in YCP Tranining camp : Both of them may join YCP Shortly..

వైసీపీలో చేరిన‌ట్లేనా..
పార్టీ శిక్ష‌ణా కార్య‌క్ర‌మానికి అతిధులుగా వ‌చ్చారా..లేక వైసీపీ మీద అభిమానంతో పాల్గొన్నారా అనేది తేలాల్సి ఉంది. ఇద్ద‌రూ ఇప్పటి వ‌ర‌కూ రాజ‌కీయంగా ఎటువంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన లేదు. శామ్యూల్ ఉమ్మ‌డి రాష్ట్రంలో జ‌గ‌న్ కేసుల్లో సీబీఐ విచార‌ణ ఎదుర్కొన్నారు. ఫ‌లితంగా ఆయ‌న సీసీఎల్ఏ గా ప‌ని చేసి..సీఎస్ అయ్యే అవ‌కాశం ఉన్నా..ఆ ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఆ త‌రువాత ఆయ‌న పైన న్న అభియోగాల‌ను కొట్టివేసారు. ఇక‌, అజ‌య్ క‌ళ్లం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల పైన అభ్య‌త‌రం వ్య‌క్తం చేసే వారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రువాత ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను బ‌హిరంగంగానే త‌ప్పు బ‌డుతున్నారు. ఇక‌, మాజీ అద‌న‌పు డీజ‌గా వ్య‌వ‌హ‌రించిన రిటైర్డ్ ఐపీఎస్ అర‌వింద‌రావు సైతం వైసీపీతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. వైసీపీ అంచ‌నా వేస్తున్న‌ట్లుగా అధికారంలోకి వ‌స్తే..అజ‌య్ క‌ళ్ళం ప్ర‌భుత్వ ప‌రిపాల‌నా స‌ల‌హాదారుడిగా నియ‌మితులు కానున్నారు. అదే విధంగా శ్యామ్యూల్‌కు సైతం కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే దీని పైన జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం.

English summary
Senior IAS officers who retired from service participated in YCP training camp for counting Agents. These Two officers may officially join in YCP shortly. Jagan planning to give priority both of them in his govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X