అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా.. 2004లో మండలిని నెలకొల్పే సమయంలో వద్దన్న చంద్రబాబు, మరీ ఇప్పుడు

|
Google Oneindia TeluguNews

శాసనసభ చేసిన చట్టాలను ఆమోదించాల్సిన మండలి అడ్డుకోవడంపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం మండలి రద్దు నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టంచేశారు. మండలి నియామకం, రద్దుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు. గతంలో వద్దని చెప్పినా.. చంద్రబాబు ఇప్పుడు రద్దుచేసే ప్రక్రియకు ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు.

అప్పుడు అలా..

అప్పుడు అలా..

2004 జూలైలో శాసనమండలి ఏర్పాటు కోసం అప్పటి సీఎం వైఎస్ఆర్ నిర్ణయం తీసుకుంటే వద్దని చిలకపలుకలు పలికింది చంద్రబాబు నాయుడేనని స్పష్టంచేశారు. కానీ ఇప్పుడు మండలి రద్దు చేస్తారా ? ఎలా రద్దుచేస్తారు ? ఎవరు అధికారం ఇచ్చారు అని ప్రశ్నలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు సభలో చంద్రబాబు ఏం మాట్లాడారో చదివి వినిపించారు.

చంద్రబాబు కామెంట్

చంద్రబాబు కామెంట్

‘మండలి నియామకంతో ప్రయోజనం ఏం లేదు. దీంతో అధికార పార్టీ వారికి మాత్రం పదవులు వస్తాయి. కొన్ని సీట్లను కార్యకర్తలు, నేతలతో కలిసి భర్తీ చేసి పునరావాస కేంద్రంగా మలుస్తారు. శాసనమండలిలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగదు. ఏం లాభం కూడా ఉండదు. 1918లో మండలి అంటే మ్యానిపులెట్ అని, 1930లో రాష్ట్రాలు కోరితే నిర్వహించుకొవచ్చని చెప్పారని పేర్కొన్నారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందే తప్ప పెద్దగా ప్రయోజనం ఏమీ లేదన్నారు.

ప్రజాధనం వృధా..

ప్రజాధనం వృధా..

అయితే స్వాతంత్ర్యం వచ్చిన్పపటి నుంచి మాత్రం చదువుకొన్న వారు పెద్దల సభలో కొలువుదీరుతున్నారని పేర్కొన్నారు. మండలితో 20 కోట్ల ప్రజాధనం వృధా అవుతుందే తప్ప ప్రజలకు మంచి జరగదు. అంతేకాదు శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును అడ్డుకొనేందుకు పనికొస్తుందని చెప్పారు. ఇది ముమ్మాటికీ రాజకీయ పునరావాస కేంద్రం అని చెప్పారు. శాసనమండలి అంటే చేతికి ఆరో వేలు లాంటిది' అని చంద్రబాబు ఆ రోజు చెప్పారని గుర్తుచేశారు.

 కేసు-లోకేశ్

కేసు-లోకేశ్

చంద్రబాబు ఆ రోజు అలా మాట్లా ఈ రోజు ఇలా కామెంట్ చేయడం సరికాదన్నారు. కావాలనుకొన్నప్పుడు ఒకలా.. వద్దనుకున్నప్పుడు మరొలా స్పందించడం ఆయనకే చెల్లిందన్నారు. ఆ రోజు చంద్రబాబు కోరిన కోరికను ఈ రోజు తీరుస్తున్నామని చెప్పారు. మీ మాట నెగ్గిన సమయంలో లోకేశ్‌గా కనిపిస్తోంది. నెగ్గని సమయంలో కేసుగా అనిపిస్తోందా అని ప్రశ్నించారు.

English summary
ycp mla chievireddy bhaskar reddy fire on tdp chief chandrababu naidu on mandali issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X