వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటోలో ఎక్కి మాటల్లో పెట్టారు: దిగాక చూసుకుంటే?, లబోదిబోమన్న మహిళ..

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఓ మహిళను మాటల్లో పెట్టి.. ఆమె వద్ద నుంచి సుమారు రూ.10లక్షల విలువ చేసే ఆభరణాలతో పరారయ్యారు ఇద్దరు కి'లేడీ'లు. ప్రహ్లాదపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలోనే నగలు చోరీకి గురైనట్టు బాధితురాలు వెల్లడించారు.

పెళ్లికని వెళ్తే..:

పెళ్లికని వెళ్తే..:

పట్నాల కళావతి (52)-బాలవీరబ్రహ్మనంద దంపతులు హైదారాబాద్‌లోని లింగంపల్లిలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. ఇటీవల కళావతి సోదరి కుమారుడికి పెళ్లి నిశ్చయమవడంతో.. పెళ్లి కోసం ప్రహ్లాదపురం వెళ్లారు. పెళ్లికని వెళ్లిన ఆమెకు చోరీ రూపంలో ఊహించని షాక్ తగిలింది.

బంగారం లాకరులో పెట్టాలనుకుంది..:

బంగారం లాకరులో పెట్టాలనుకుంది..:

ఈ నెల 3న పెళ్లి జరగ్గా.. వివాహానంతరం కళావతి కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చేశారు. కళావతి మాత్రం బాలాజీనగర్ లోని బంధువుల ఇంట్లోనే ఉండిపోయారు. వెంట తెచ్చుకున్న బంగారు ఆభరణాలను పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ లాకరులో భ్రదపరుచుకుని వెళ్దామనుకున్నారు.

కిలేడీల పనేనా?:

కిలేడీల పనేనా?:


సోమవారం మధ్యాహ్నాం బంగారు ఆభరణాలు తీసుకుని కళావతి ఆంధ్రాబ్యాంక్ బయలుదేరారు. ఆటోలో వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో మరో ఇద్దరు మహిళలు కూడా అందులో ఎక్కారు.

కళావతిని మాటల్లో పెట్టిన ఆ ఇద్దరు ఆమెకు తెలియకుండా బంగారం చోరీ చేశారు. కళావతి ఆటో దిగాక చూసుకుంటే బంగారం కనిపించలేదు. ఆ ఇద్దరు మహిళలు మధ్యలోనే దిగిపోవడంతో వారి పైనే అనుమానం కలిగింది.

35తులాలు చోరీ..:

35తులాలు చోరీ..:

కళావతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గోపాలపట్నం బీఆర్టీఎస్‌ రహదారిలోని మేదరివీధి సమీపంలో ఆ ఇద్దరు ఆటో దిగారని, అప్పటివరకు ఎన్‌ఏడీ కొత్తరోడ్డు వరకు వస్తామన్నవారు కాస్త మధ్యలోనే దిగడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 35తులాల బంగారం చోరీ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం దీనిపై గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Two women thieves are theft jewelry from a passenger in an auto in Gopalapatnam. Woman complainted to police on Monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X