• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రాష్ట్రానికి రానున్న తొలి ప్రాజెక్ట్‌..!

|

క‌ర్నూలు: రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే ఓ భారీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి రానుంది. 2,500 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఓ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కానుంది. అదే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ. క‌ర్నూలు జిల్లాలోని పెట్నికోట‌లో ఈ యూనిట్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ‌శాఖ సైతం క్లియ‌రెన్స్‌ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న మంజూరు చేసింది.

ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ‌ల్లో ఒక‌టైన అల్ట్రాటెక్ సిమెంట్ క‌ర్మాగారాలు ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లో ఉన్నాయి. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి స‌మీపంలో, క‌ర్నూలు జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లి వ‌ద్ద ఉన్నాయి. తాజాగా- మ‌రో క‌ర్మాగారాన్ని ఏర్పాటు చేయ‌డానికి ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల అధినేత కుమార మంగ‌ళం బిర్లా ముందుకొచ్చారు. క‌ర్నూలు జిల్లా పెట్నికోట వ‌ద్ద కొత్త‌గా మ‌రో క‌ర్మాగారాన్ని ఏర్పాటు చేయ‌డానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

UltraTech Cement gets green nod for Rs 2,500 cr project in Andhra Pradesh

2,500 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో సిమెంట్ క‌ర్మాగారంతో పాటు 60 మెగావాట్ల సామ‌ర్థ్యం గ‌ల ఓ విద్యుత్ ఉత్పాద‌క కేంద్రాన్ని కూడా నెల‌కొల్ప‌నున్నారు. సొంత (క్యాప్టివ్) ప‌వ‌ర్ ప్లాంట్ రూపంలో దీన్ని నిర్మిస్తారు. అంటే- ఇందులో నుంచి ఉత్ప‌త్త‌య్యే విద్యుత్‌ను సొంత అవ‌స‌రాల కోసం మాత్ర‌మే వినియోగించుకుంటారు. దీనికి అనుగుణంగా మ‌రో 15 మెగావాట్లను ఉత్ప‌త్తి చేయ‌గ‌ల మ‌రో విద్యుత్ కేంద్రాన్ని ప్ర‌త్యేకంగా నిర్మిస్తారు. సిమెంట్ క‌ర్మాగారం నుంచి వెలువడి వ్య‌ర్థంగా వెళ్లే అధిక ఉష్ణోగ్ర‌త ఆధారంగా ఈ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేస్తారు.

UltraTech Cement gets green nod for Rs 2,500 cr project in Andhra Pradesh

అల్ట్రాటెక్ సిమెంట్ క‌ర్మాగారాన్ని నెల‌కొల్ప‌డానికి ఆదిత్య బిర్లా సంస్థ యాజ‌మాన్యం ఇదివ‌ర‌కే 430 ఎక‌రాల‌ను పెట్నికోట గ్రామం వ‌ద్ద కొనుగోలు చేసింది. ఏటా 60 లక్షల టన్నుల సిమెంట్‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ క‌ర్మాగారం వ‌ల్ల స్థానికంగా 900 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. స‌మీపంలోని అవుకు రిజ‌ర్వాయ‌ర్ నుంచి దీనికి నీటి వ‌స‌తిని క‌ల్పిస్తారు.

ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల అధినేత కుమార మంగ‌ళం బిర్లా దీనిపై ఇదివ‌ర‌కే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఏపీ భ‌వ‌న్‌లో బ‌స చేసిన వైఎస్ జ‌గ‌న్‌ను కుమార మంగ‌ళం బిర్లా స్వ‌యంగా స్వ‌యంగా వ‌చ్చి క‌లుసుకొన్న విష‌యం తెలిసిందే. అప్పుడే దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
UltraTech Cement has got environment ministry's nod for a Rs 2,500 crore project in Andhra Pradesh, as per an official document. Under the project, the company will set up an integrated cement plant at Petnikote village in Kurnool district with a clinker capacity of 4 million tonne per annum (MTPA), 6 MTPA of cement, 60 mega watt of captive power plant and 15 mega watt of waste heat recovery-based power unit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more