వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నావల్లే హైద్రాబాద్‌కి గూగుల్: షాకు గుర్తుచేసిన బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక సమస్యలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు.

కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సోమవారం భేటీ అయ్యారు. మంగళవారం జైట్లీని కలిశారు. అనంతరం కేంద్రమంత్రి సుజనా చౌదరి విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సహా ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు.

నిధుల కొరత ఉండకుండా చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారన్నారు. ఏపీ రాజధానిని కలుపుతూ హైవేల నిర్మాణం ఉంటుందన్నారు. కాగా, జైట్లీతో భేటీ అనంతరం చంద్రబాబు చండీగఢ్ బయలుదేరారు. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ నుండి చంఢీగఢ్ బయలుదేరారు.

 చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు రాజకీయ విభేదాలు పక్కనపెట్టి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆశించిన స్పందన లభించడం లేదని సోమవారం రాత్రి మీడియాతో అన్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చుని, టీడీపీ తెలంగాణలోనూ ఉన్నందున రాజకీయ పోటీ తప్పదన్నారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

అయితే, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సాగాలన్నారు. ఇద్దరు సీఎంలు కూర్చుని సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుందన్నారు. అందుకు అనువైన వాతావరణం కూడా ఉందని చెప్పారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. ఒకవేళ పరస్పరం సహకరించుకోవడం సాధ్యపడకపోతే కేంద్రాన్ని మధ్యవర్తిగా పెట్టి పరిష్కరించుకుందామని సలహా ఇచ్చినట్టు తెలిపారు.

 చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

దీనికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. జూన్ 2లోగా సమస్యను పరిష్కరించుకోని పక్షంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. రాజ్యాంగంలోని తొమ్మిది, పది షెడ్యూళ్ల ప్రకారం, అదే విధంగా పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఎన్డీయే ప్రభుత్వం పైన, టీడీపీ పైన ప్రజలలో విశ్వాసం మరింత పెరిగిందని బాబు చెప్పారు. బీజేపీఅధ్యక్షుడు అమిత్ షాతో తాను రెండు పార్టీలకు సంబంధించిన సమకాలీన అంశాలను చర్చించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందిస్తేతప్ప ఆంధ్రప్రదేశ్ తన కాళ్లపై తాను నిలబడలేదన్న విషయాన్ని మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియజేశామన్నారు. కేంద్రం నుంచి ఆశించిన సహాయం లభిస్తుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు. 2018నాటికి పథకాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించటానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

 చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

కాగా, అమిత్ షాతో భేటీలో తమకు ఇస్తామన్న గవర్నర్ పదవిని చంద్రబాబు గుర్తు చేశారు. విభజన సమస్యల్ని పరిష్కరించాలని హోంమంత్రికి లేఖ రాశారు. తన వల్లే హైదరాబాద్‌లో గూగుల్ సంస్థ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచ శ్రేణి సాఫ్టువేర్ సంస్థలను హైదరాబాద్ తీసుకు వచ్చానని, ఇప్పుడు ఆ ఖ్యాతి వల్లే గూగుల్ లాంటి సంస్థలు హైదరాబాద్ వస్తున్నాయన్నారు.

English summary
Union Minister for Water Resources Uma Bharati on Monday assured that the Centre would do everything for completion of the Polavaram project on time after Chief Minister Chandrababu Naidu met her and took up the issue of increasing the funding for the project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X