గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

|
Google Oneindia TeluguNews

అమరావతి : వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏపీలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు చేస్తున్న దీక్ష విరిమించేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పడిపోయారు. వెంటనే తేరుకున్న సిబ్బంది హుటహుటిని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు రక్తపీడనం ఎక్కువై ఇలా జరిగి ఉంటుందా ? లేదంటే ఫుడ్ పాయిజన్ జరిగిందా అని అనుచరులు అనుమానిస్తున్నారు.

గుంటూరులోని ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఫంక్షన్ హాల్ సమీపంలో వ్యవసాయశాఖలోని ఎంపీఈవోలు ఆందోళన చేపడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని గత 20 రోజులుగా డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని కలిసేందుకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెళ్లారు. వారు తమ ఆందోళనను విరమించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఉమ్మారెడ్డి .. అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి పడిపోవడంతో అనుచరులు వెంటనే అప్రమత్తమయ్యారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ummareddy venkateshwarlu ill

పడిపోయాక కూడా ఉమ్మారెడ్డి తేరుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే వాంతులు కావడంతో అనుచరులు వెంటనే గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. అ్ితే అతనికి బీపీ ఎక్కువైందా ? లేదంటా ఫుడ్ పాయిజన్ జరిగిందా అని అనుచరులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఉమ్మారెడ్డి అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా తన కార్యక్రమాలను రద్దు చేసుకొని వచ్చారు. ఉమ్మారెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీశారు.
English summary
YCP senior leader Ummareddy Venkateshwar has been ill. When the employees of the Department of Agriculture in AP went on a break, they suddenly fell. The crew immediately rushed to Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X