అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ బంద్: సక్సెస్, సర్వశక్తులు ఒడ్డిన జగన్‌ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకోహోదా కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఏపీలో బంద్ చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మండ‌ల స్థాయి నుంచి నియోజకవర్గాల వారీగా ప్రతి ఒక్కరు బంద్‌ను విజయవంతం చేసే దిశగా దృష్టి సారించాలని ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలకు వైయస్ జగన్ సూచించారు.

బంద్‌ను విజయవంతం చేసేందుకు జిల్లాల ఇన్‌ఛార్జులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ముందస్తు అరెస్ట్‌ల‌తో బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్తున్నారు. వైసీపీ బంద్‌కు వామపక్షాలు మద్దతు ప్రకటించడంతో విజయం దిశగా అడుగులేస్తోంది.

అందరికీ కృతజ్ఞతలు: ఉమ్మారెడ్డి

అందరికీ కృతజ్ఞతలు: ఉమ్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ వైసీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతిచ్చి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం చేస్తున్న బంద్ ప్రజా ఉద్యమం అని ఆయన అన్నారు. బంద్‌ను విఫలం చేయాలని అనుకోవడం అవివేకమని ఉమ్మారెడ్డి చెప్పారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కని ప్రజలు నినదిస్తున్నారని ఆయన తెలిపారు.

అంబటి రాంబాబు అరెస్ట్: స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా వైసీపా కార్యకర్తలతో పాటు సీపీఎం, సీపీఐ కార్యకర్తలతో కలసి శనివారం ఆయన పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

ప్రకాశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని అరెస్ట్

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వైసీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. బస్సులను అడ్డుకుంటున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినందుకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.

 భీమవరంలో కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వైసీపీ బంద్‌లో భాగంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని కార్యకర్తలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కడప బంద్ ప్రశాంతం

కడప బంద్ ప్రశాంతం

కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. శనివారం ఆయన వైఎస్సార్‌జిల్లా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్టు వద్ద జరిగిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

కడప బంద్ ప్రశాంతం

కడప బంద్ ప్రశాంతం

శనివారం తెల్లవారుజామున 5గంటలకే కార్యకర్తలతో కలిసి ప్రాజెక్టు దగ్గరకు ఆయన చేరుకున్నారు. ప్రాజెక్టులో పని చేసే ఉద్యోగులను, కార్మికులను విధుల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. దీంతో యురేనియం ప్రాజెక్టులో శనివారం పనులు నిలిచిపోయాయి. ఈ మేరకు యురేనియం ప్రాజెక్టు ఉద్యోగులు, కార్యకర్తలు బంద్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని నిరసన తెలిపారు.

 అనంతలో రహదారుల దిగ్బంధం

అనంతలో రహదారుల దిగ్బంధం

అనంతపురం పట్టణంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో శాంతి యుంతగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు జిల్లాలోని శింగనమల నియోజికవర్గం వ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం చేశారు. వైసీపీ చేపట్టిన బంద్‌కు వ్యాపారుల నుంచి మద్దతు రావడంతో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ బంద్‌కు వామపక్షాలు మద్దతు అందించాయి.

 కర్నూలులో భూమా నేతృత్వంలో బంద్

కర్నూలులో భూమా నేతృత్వంలో బంద్

బంద్‌లో భాగంగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జాతీయ రహదారిని నిర్భందించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారి నిర్భందంలో పాల్గొన్నారు. దీంతో శనివారం పోలీసులు 15 మంది వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు.

 కర్నూలులో భూమా నేతృత్వంలో బంద్

కర్నూలులో భూమా నేతృత్వంలో బంద్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 డిపోల్లో 920 బస్సులు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. నంద్యాలలో బస్సులు నిలిచిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాల శ్రేణులు బంద్ విజయవంతానికి కృషి చేశారు.

 కర్నూలులో భూమా నేతృత్వంలో బంద్

కర్నూలులో భూమా నేతృత్వంలో బంద్

ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఉదయం 9.30 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించారు. వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసివేశారు. ఎమ్మిగనూరులో తెల్లవారు జాము నుంచే పార్టీ శ్రేణులు బస్సులను ఆపివేశారు. దుకాణాలను మూసివేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.

అందరికీ కృతజ్ఞతలు: ఉమ్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ వైసీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతిచ్చి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేకహోదా కోసం చేస్తున్న బంద్ ప్రజా ఉద్యమం అని ఆయన అన్నారు. బంద్‌ను విఫలం చేయాలని అనుకోవడం అవివేకమని ఉమ్మారెడ్డి చెప్పారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కని ప్రజలు నినదిస్తున్నారని ఆయన తెలిపారు.

అంబటి రాంబాబు అరెస్ట్: స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా వైసీపా కార్యకర్తలతో పాటు సీపీఎం, సీపీఐ కార్యకర్తలతో కలసి శనివారం ఆయన పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

ప్రకాశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని అరెస్ట్

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వైసీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. బస్సులను అడ్డుకుంటున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినందుకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.

భీమవరంలో కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వైసీపీ బంద్‌లో భాగంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని కార్యకర్తలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కడప బంద్ ప్రశాంతం

కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. శనివారం ఆయన వైఎస్సార్‌జిల్లా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్టు వద్ద జరిగిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

శనివారం తెల్లవారుజామున 5గంటలకే కార్యకర్తలతో కలిసి ప్రాజెక్టు దగ్గరకు ఆయన చేరుకున్నారు. ప్రాజెక్టులో పని చేసే ఉద్యోగులను, కార్మికులను విధుల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. దీంతో యురేనియం ప్రాజెక్టులో శనివారం పనులు నిలిచిపోయాయి. ఈ మేరకు యురేనియం ప్రాజెక్టు ఉద్యోగులు, కార్యకర్తలు బంద్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని నిరసన తెలిపారు.

అనంతలో రహదారుల దిగ్బంధం

అనంతపురం పట్టణంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో శాంతి యుంతగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు జిల్లాలోని శింగనమల నియోజికవర్గం వ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం చేశారు. వైసీపీ చేపట్టిన బంద్‌కు వ్యాపారుల నుంచి మద్దతు రావడంతో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ బంద్‌కు వామపక్షాలు మద్దతు అందించాయి.

కర్నూలులో భూమా నేతృత్వంలో బంద్

బంద్‌లో భాగంగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జాతీయ రహదారిని నిర్భందించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారి నిర్భందంలో పాల్గొన్నారు. దీంతో శనివారం పోలీసులు 15 మంది వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు.

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 డిపోల్లో 920 బస్సులు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. నంద్యాలలో బస్సులు నిలిచిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాల శ్రేణులు బంద్ విజయవంతానికి కృషి చేశారు.

ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఉదయం 9.30 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించారు. వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసివేశారు. ఎమ్మిగనూరులో తెల్లవారు జాము నుంచే పార్టీ శ్రేణులు బస్సులను ఆపివేశారు. దుకాణాలను మూసివేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.

English summary
ummareddy venkateswarlu thanks to supporters for ysrcp dharna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X