వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ విభజన దారుణాలన్నీ చెప్తారు, ఆధారాలు నీకిస్తా: బాబుకు ఉండవల్లి 'గోల్డెన్' ఛాన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం బహిరంగ లేఖ రాశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చివరివి అన్నారు. తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారన్న మోడీ ప్రసంగంపై టీడీపీ ఎంపీలు లోకసభలో చర్చకు పట్టుబట్టాలన్నారు.

సొంత నియోజకవర్గంలో రోజాకు చేదు: దాడికి యత్నం, అడ్డుకున్న వైసీపీసొంత నియోజకవర్గంలో రోజాకు చేదు: దాడికి యత్నం, అడ్డుకున్న వైసీపీ

విభజన సరిగా జరగలేదనేందుకు నా వద్ద ఆధారాలు

విభజన సరిగా జరగలేదనేందుకు నా వద్ద ఆధారాలు

రాజ్యాంగబద్ధంగా విభజన జరగలేదనడానికి తాను ఆధారాలు ఇస్తానని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నోటీసులు ఇవ్వకుంటే తాను ఇతర రాష్ట్రాల పార్టీలకు ఏపీ గోడును వినిపిస్తానని చెప్పారు. రాష్ట్రం కోసం ఢిల్లీలో సోలోగా పోరాడే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిందని చెప్పారు. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు.

మోడీ ప్రసంగంపై టీడీపీ ఎంపీలు చర్చకు పట్టుబట్టాలి

మోడీ ప్రసంగంపై టీడీపీ ఎంపీలు చర్చకు పట్టుబట్టాలి

తలుపులు మూసి విభజన చేశారన్న మోడీ ప్రసంగంపై టీడీపీ ఎంపీలు చర్చకు పట్టుబడితే, ఆ అంశంపై పార్లమెంటులో చర్చ జరిగితే కాంగ్రెస్, బీజేపీలలో ఎవరు దోషో తేలిపోతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కాబట్టి ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు టీడీపీకి గోల్డెన్ ఛాన్స్ అన్నారు. బీజేపీతో పొత్తు లేదు కాబట్టి చంద్రబాబు గట్టిగా నిలదీయవచ్చునని చెప్పారు.

Recommended Video

పవన్ ,జగన్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
దారుణాలన్నీ అద్వానీకి తెలుసు, ఇప్పుడు చెప్తారు

దారుణాలన్నీ అద్వానీకి తెలుసు, ఇప్పుడు చెప్తారు

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చెల్లుబాటు కాదని, నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో పోరాటం చేయాలని ఏపీ పార్టీలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. నాడు రాష్ట్ర విభజనను భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కూడా సమర్థించలేదని ఆయన చెప్పారు. సభలో విభజన బిల్లు ఆమోదం కోసం ఎన్ని దారుణాలు జరిగాయో అద్వానీకి తెలుసునని చెప్పారు. ఇప్పుడు ఇందుకు సంబంధించి నోటీసులు ఇస్తే అద్వానీ కూడా అన్ని విషయాలు చెబుతారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభలో లేవెనత్తిన అంశాలపై చర్చించాలని, ప్రధాని చెప్పిన మాటలపై ఎంపీలు వివరణ కోరాలని కూడా ఆయన సూచించిన విషయం తెలిసిందే. పార్లమెంటు తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింప చేశారని ఉండవల్లి విమర్శించారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై నిలదీయకుంటే ప్రజా ప్రతినిధులుగా అనర్హులు అన్నారు. ఏపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు.

ఏ నిమిషం ఏం జరిగిందో తెలుసు

ఏ నిమిషం ఏం జరిగిందో తెలుసు

అవిశ్వాస తీర్మానాన్ని సభ నిర్ణయించాలని, కానీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. పార్లమెంటులో ఏ నిమిషం ఏం జరిగిందో రికార్డు ఉంటుందన్నారు. మీడియాకు కూడా నేను రికార్డులు ఇస్తానన్నారు. విభజన బిల్లుపై సభలో జరిగిన వాటిపై అందరికీ మెయిల్స్ పంపించానని చెప్పారు.

 టీడీపీ-బీజేపీ ఫైట్

టీడీపీ-బీజేపీ ఫైట్

కేంద్ర ప్రభుత్వం నుంచి నుంచి టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చాక టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వైసీపీ, జనసేలతో లోపాయికారి ఒప్పందంతో టీడీపీని దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబుకు మద్దతుగా.. ఆధారాలు

చంద్రబాబుకు మద్దతుగా.. ఆధారాలు

ఇలాంటి సమయంలో చంద్రబాబు మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో పాటు సరైన విభజన జరగలేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అన్యాయమైన విభజన చేసిందని ఆరోపిస్తున్నారు. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు ఉండవల్లి ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగబద్ధంగా విభజన జరగలేదని నిరూపించే ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని టీడీపీకి ఇస్తానని చెప్పడం గమనార్హం.

English summary
Former Lok Sabha Member Undavlli Arun Kumar on Thursday said that he have the proofs about Unconstitutionally Andhra Pradesh division. He said he is ready to give TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X