వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప‌ది సీట్లు వ‌స్తే బాబు చ‌క్రం తిప్పుతారు : ఓటుకు నోటు కేసులో జ‌రిగేదేంటంటే : ఉండ‌వ‌ల్లి జోస్యం..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌ది సీట్లు వ‌స్తే చంద్ర‌బాబు కేంద్రంలో చ‌క్రం తిప్పుతార‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. ఎన్డీఏ..యుపీఏకు మెజార్టీ రాక‌పోతే..ప్రాంతీయ పార్టీలు కీల‌కం అవుతాయ‌ని..అప్పుడ చంద్ర‌బాబు క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్పుకొచ్చారు. ఓటుకు నోటు కేసు ఎప్ప‌టికీ క‌ద‌ల‌ద‌ని తేల్చి చెప్పారు. బిల్లుల చెల్లింపుల్లోనే సీఎం..సీఎస్ మ‌ధ్య వివాద నెల‌కొంద‌న్నారు ఉండ‌వ‌ల్లి. చంద్ర‌బాబు ఇరిటేష‌న్ త‌గ్గించుకోవాల‌ని సూచించారు.

ప‌ది సీట్లు వ‌స్తే చ‌క్రం ఆయ‌న‌దే..

ప‌ది సీట్లు వ‌స్తే చ‌క్రం ఆయ‌న‌దే..

జాతీయ రాజ‌కీయాల పైన మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ విశ్లేష‌ణ చేసారు. కేంద్రంలో ఎవ‌రికీ పూర్తి మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం లేద‌న్నారు. ఎన్డీఏ..యూపీఏ అవ‌స‌ర‌మైన మేజిక్ ఫిగ‌ర్ సాధించ‌క‌పోతే ప్రాంతీయ పార్టీలే కీల‌క పాత్ర పోషించ‌నున్నాయ‌ని పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో ఏపిలోని మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల్లో ప‌దికి పైగా టీడీపీ సాధిస్తే అప్పుడు కేంద్ర రాజ‌కీయాల్లో చంద్ర‌బాబుకు చ‌క్రం తిప్పే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని విశ్లేషించారు. గ‌తంలో ఆయ‌న‌కు ఉన్న ప‌రిచ‌యాలు..అనుభ‌వం ఇప్పుడు మేలు చేస్తుంద‌ని చెప్పుకొచ్చారు. కానీ, ఏపీలో ఆయ‌న‌కు వ‌చ్చే సీట్ల పైనే మొత్తం వ్య‌వ‌హారం ఆధార ప‌డి ఉంటుంద‌ని జోస్యం చెప్పారు. ఎన్నిక‌ల్లో ఓటేసి తర్వాత మీడియా ముందుకొచ్చి ఏ ముఖ్యమంత్రి అయినా నా ఓటు నాకే పడిందో లేదో తెలియ తెలియదు అనడం సరైనది కాదన్నారు.

సీఎస్‌తో వివాదానికి కార‌ణం అదే..

సీఎస్‌తో వివాదానికి కార‌ణం అదే..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం మ‌ధ్య కొన‌సాగుతున్న వివాదం పైనా ఉండ‌వ‌ల్లి స్పందించారు. సీఎస్ వర్సెస్ సీఎం వీరి గొడవ ఏంటో త‌న‌కు అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్‌ ఉన్న సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ నేతలను చాలా ఇబ్బంది పెట్టింద‌ని గుర్తు చేసారు.ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ కోర్డు వెళ్లారుని... కోర్టు మొట్డికాయలు వేస్తే ఎల్వీకి బాధ్యతలు ఇచ్చారన్నారు. అసలు చంద్రబాబుకు సుబ్రమణ్యంతో గొడవ ఏంటో అర్ధం కావడం లేదని... చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారికి బిల్లులు మంజూరు చేయలని తపన పడ్డారని... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఎల్వీపై ఆరోపణలు చేస్తున్నారని ఉండ‌వ‌ల్లి చెప్పుకొచ్చారు.

బాబు..ఇరిటేష‌న్ తగ్గించుకోండి

బాబు..ఇరిటేష‌న్ తగ్గించుకోండి

చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీవీ ప్యాడ్ల స్లిప్పులు లెక్కించాలనే డిమాండ్ మీద స్పందించిన ఉండ‌వ‌ల్లి ఇప్పుడు చంద్రబాబు ఇరిటేషన్‌కి గురవుతున్నారన్నారు. కొంచెం ఇరిటేసన్ తగ్గించుకోండి చంద్రబాబు... మీరు ఓడిపోయినా..మీ పార్టీ జనంలో ఉంటుందని సూచించారు. వచ్చే సారి అధికారంలోకి వస్తుందన్నారు. ఎందుకు రిజల్ట్ రాకుండా ఆవేశపడుతున్నారో అర్థం కావలేదని వ్యాఖ్యానించారు. లాస్ట్ టైం అవే ఈవిఎంలతో గెలిచారని...ఇప్పుడు వాటితోనే ఎన్నికలకు వెళ్తే ఎందుకు అంత బాధ‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు.

English summary
Ex MP Undavalli Arun Kumar says if TDP Get 10 loksabha seats Then chance For Chandra Babu to play key role in national politics. Arun Kumar said Babu is in frustration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X