వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ వల్లే గెలిచావ్.. ఇదీ లెక్క, ఓటుకు నోటు నుంచి ఎస్కేప్, మీరే కారణం: బాబుపై ఉండవల్లి

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు, హైకోర్టులలో తాను, రామచంద్ర రావు పిటిషన్లు దాఖలు చేశామని, వాటిని సమర్థిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు.

రెచ్చగొడుతావా, టీడీపీని మరిచేవారు, సినిమాల్లేని హీరోతో: బాబుకు జీవీఎల్ దిమ్మతిరిగే షాక్రెచ్చగొడుతావా, టీడీపీని మరిచేవారు, సినిమాల్లేని హీరోతో: బాబుకు జీవీఎల్ దిమ్మతిరిగే షాక్

Recommended Video

డబ్బు ఒకటి ఉంటే సరిపోదు...శివాజీ కి పంచ్

ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగాలన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దుమ్ముదులిపారు. విజయసాయి రెడ్డి తిట్టాడు, బీజేపీ మోసం చేసింది.. ఎప్పుడూ ఇదేనా అని ఎద్దేవా చేశారు.

చదవండి: వాడెవడో తిట్టాడని.. పనికిరానిది? నేనైతే ఇలా: విజయసాయి అంశంపై బాబుకు ఉండవల్లి

నేనో సూచన చేస్తున్నా

నేనో సూచన చేస్తున్నా

చంద్రబాబు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడని ఉండవల్లి మండిపడ్డారు. గత మూడు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విభజన అంశాల గురించి మాట్లాడుతున్నారని, కానీ ఆయనకు తాను ఓ సూచన చేయదల్చుకున్నానని చెప్పారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చంద్రబాబు గతంలో చెప్పారని, ఆయన ఆ దిశలో ముందుకు సాగాలని హితవు పలికారు.

ఆర్నెళ్లుగా కదలిక లేదు, 24 గంటలు పట్టదు

ఆర్నెళ్లుగా కదలిక లేదు, 24 గంటలు పట్టదు

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే ప్రతి పైసా కట్టాలని కోర్టులో తమను సమర్థించాలని ఉండవల్లి అన్నారు. తాను, రామచంద్ర రావు కోర్టులో వేసిన రిట్ పిటిషన్లలో మీరు కూడా జత కలవాలని చంద్రబాబుకు సూచించారు. పోలవరంపై నిజానిజాలు మీ కౌంటర్ ఫైల్ ద్వారా కోర్టుకు తెలియజేయాలని చంద్రబాబుకు సూచించారు. ప్రత్యేక హోదా, పోలవరంపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రిట్ పిటిషన్లు ఉన్నాయని, ఇవి సరైనవేనని ఫైల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టులలో మా రిట్ పిటిషన్ సమర్థించమని అడిగామని, కానీ ఆరు నెలలు గడిచినా ఎలాంటి కదలిక లేదన్నారు. ఇప్పటికైనా అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కౌంటర్ ఫైల్‌కు 24 గంటలు పట్టదని చెప్పారు. అలా చేస్తే రాష్ట్రానికి కచ్చితంగా మంచి జరుగుతుందని ఉండవల్లి చెప్పారు. రిట్‌లో తమ వాదన సమర్థించమని చెప్పడం లేదని, నిజం చెప్పమని అంటున్నామని తెలిపారు.

 ఈ అన్యాయానికి మీరే కారణం, మీరు సీన్ మార్చగలరు

ఈ అన్యాయానికి మీరే కారణం, మీరు సీన్ మార్చగలరు

ఈ రోజు జరుగుతున్న దానికి చంద్రబాబు బాధ్యులు అని, మంచి జరిగినా, అన్యాయం జరిగినా ఆయనే బాధ్యులు అన్నారు. నాలుగేళ్ల అన్యాయానికి మీరే కారణం అన్నారు. ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఈ రోజు జరిగిన అన్యాయానికి కచ్చితంగా మీరే కారణం అన్నారు. ఈ తొమ్మిది నెలల్లో మీరు సీన్ మార్చగలరని, ఆ సామర్థ్యం చంద్రబాబుకు ఉందన్నారు.

నేను బలవంతుడ్ని అని చెప్పేందుకు బాబు లెక్కలు

నేను బలవంతుడ్ని అని చెప్పేందుకు బాబు లెక్కలు

2014లో బీజేపీతో పొత్తు వల్ల తాము 15 సీట్లు కోల్పోయామని చంద్రబాబు చెబుతున్నారని, అదంతా ఏదో తాను బలవంతుడిని అని చెప్పుకునేందుకే లెక్కలు చెబుతున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. అందుకు ఆయన 2014కు ముందు జరిగిన లోకల్ బాడీ ఎన్నికల లెక్కలు చెబుతున్నారని, కానీ అది సరికాదన్నారు. మున్సిపల్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వేరు అన్నారు.

కచ్చితంగా బీజేపీ, పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు గెలిచారు

కచ్చితంగా బీజేపీ, పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు గెలిచారు

నాడు నరేంద్ర మోడీ హవా బాగా ఉందని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జత కలిశారని, అందుకే చంద్రబాబు గెలిచారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మరో విషయం ఏమంటే అప్పటికి వైసీపీ, టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నాయన్నారు. ఈ లెక్కన బీజేపీతో కలవకుంటే చంద్రబాబు ఓడిపోయేవారని, మోడీ హవా వల్లే గెలిచారని అభిప్రాయపడ్డారు.

ఏరుదాటాక తెప్పతగిలేసినట్లుగా

ఏరుదాటాక తెప్పతగిలేసినట్లుగా

బీజేపీ, పవన్ పైన టీడీపీ విమర్శల పైనా ఉండవల్లి స్పందించారు. చంద్రబాబు తీరు ఏరు దాటాక తెప్పతగలేసినట్లుగా ఉందన్నారు. 2004లో బీజేపీ వల్ల ఓడిపోయామని చెప్పారని, 2014లో పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు మళ్లీ బీజేపీ వల్ల సీట్లు తగ్గాయని చెప్పడం విడ్డూరమన్నారు. మీకు (చంద్రబాబు) మరొ తొమ్మిది నెలలు మాత్రమే ఉందని, ఈ కాలం రాష్ట్రం గురించి ఆలోచించాలని సూచించారు.

ఓటుకు నోటు నుంచి ఆల్ రెడీ ఎస్కేప్

ఓటుకు నోటు నుంచి ఆల్ రెడీ ఎస్కేప్

అంతేకాకుండా, చంద్రబాబు పదేపదే తనపై బీజేపీ కేసులు పెడుతుందనే వాదనను తెరపైకి తెచ్చారని ఉండవల్లి మండిపడ్డారు. లాలూ ప్రసాద్ పైన బీజేపీ కేసులు పెట్టలేదని, కానీ ఆయన జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఈ రోజు చంద్రబాబుపై కేసులు పెడితే జనం ఊరుకోరన్నారు. కేసు పెట్టే ధైర్యం చేయరన్నారు. అలాంటి కేసులు కూడా లేవన్నారు. ఓటుకు నోటు కేసులో ఆల్ రెడీ ఆయన ఎస్కేప్ అయ్యారన్నారు. ఆ కేసు నుంచి తప్పించుకున్నారన్నారు.

English summary
Former MP Undavalli Arun Kumar fired at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu for Special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X