• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తక్షణమే ఖాళీ చేయండి..చంద్రబాబు నివాసానికి నోటీసు : మునిగిన హెలీప్యాడ్..గార్డెన్...!!

|

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పైన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆయన నివాసం వద్ద హెలిప్యాడ్..గార్డెన్ వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో.. చంద్రబాబు నివాసంతో పాటుగా పరివాహక ప్రాంతాల్లోని నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉందని తక్షణమే ఖాళీ చేయలంటూ కరకట్ట వెంబడి ఉన్న అక్రమ నిర్మాణ దారులకు ప్రభుత్వం నీటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఉండవల్లి గ్రామ వీఆర్వో చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. ఇప్పటికే 32 మందికి నోటీసులు ఇచ్చామని ఉండవల్లి వీఆర్వో వెల్లడించారు.

 చంద్రబాబు నివాసానికి నోటీసులు

చంద్రబాబు నివాసానికి నోటీసులు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి మరో సారి నోటీసులు జారీ అయ్యాయి. గతంలో అక్రమ నిర్మాణం అంటూ సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఆ వ్యవహారం ఇప్పడు కోర్టు పరిధిలోకి వెళ్లటంతో దాని పైన చర్చ మళ్లి ఇప్పుడు వరదల చుట్టూ తిరుగుతోంది. రెండు రోజులుగా చంద్రబాబు నివాసంలో వదర నీరు చేరుతోంది. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన విజువల్స్ లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తమ అధినేత నివాసం వరద నీటిలో ముగినిగిందని చెప్పుకొవటం కోసమే ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. మరో రెండు రోజులు వరద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెళ్లారు. కృష్ణా నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున.. తక్షణమే ఖాళీ చేయాలంటూ నోటీసు ఇచ్చేందుకు ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. ఇప్పటికే 32 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీని పైన టీడీపీ నేతలు అధికారికంగా స్పందించలేదు. అయితే, ప్రస్తుతం ఆ నివాసంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు.

నీట మునిగిన హెలీప్యాడ్.. గార్డెన్..

నీట మునిగిన హెలీప్యాడ్.. గార్డెన్..

ఎగువ నుండి ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వదర ఉధృతి పెరుగుతోంది. దీంతో..ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇదే సమయంలో కృష్ణానదీ తీరానా ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ కట్టడ నివాసం వద్ద పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. దీంతో నివాసంలోని గార్డెన్‌, బయట ఉన్న హెలీప్యాడ్‌ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 ట్రక్కుల చిప్స్, ఇసుక బస్తాలను వేస్తున్నారు. అయినా వరద ఉధృతిని అవి కూడా ఆపలేకపోతున్నాయి. రివర్‌ ఫ్రంట్‌ వ్యూ భవనం, వాక్‌వే ఇప్పటికే నీట మునిగాయి. ఆయన నివాసాన్ని వరద నీరు పూర్తి స్థాయిలో చుట్టుముట్టుతోంది. శనివారం సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో నివాసంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారుల హెచ్చరించారు. అయితే, చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు మిహాన చంద్రబాబుకు కుటుంబ సభ్యులు కనిపించటం లేదు. నివాసంలోకి నీరు రాకుండా సిబ్బంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ వరద నీటిని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులను సైతం టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు.

అమరావతికి రాని చంద్రబాబు..

అమరావతికి రాని చంద్రబాబు..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు అమరావతికి చేరుకోలేదు. సాధారణంగా ఆయన వీకెండ్స్ లో హైదరాబాద్ లోనే ఉంటారు. అయితే, షెడ్యూల్ ప్రకారం ఆయన శుక్రవారం ఉదయం అమరావతికి రావాల్సి ఉంది. కానీ, వరద పేరుతో జరుగుతున్న రాజకీయం కారణంగా ఆయన అమరావతికి రాలేదని తెలుస్తోంది. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరిందని విజువల్స్ టీవీల్లో ప్రసారమవుతున్నాయి. అయితే, టీడీపీ నేతలు మాత్రం ప్రభుత్వ కుట్ర పూరితంగా చంద్రబాబు నివాసం వరద నీటీలో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు..లోకేశ్ కాన్వాయ్ హాయ్ ల్యాండ్ కు తరలించారు. కింది అంతస్థులో ఉన్న సామాన్లను పైకి తరలించారు. వరదల కారణంగా అనేక మంది శిబిరాల్లో చేరుతుంటే...చంద్రబాబు నివాసం చుట్టూ అధికార .. ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Undavalli VRO issed notice to Chandra babu house to vacate house immeadiately. In that notice flood situation mentioned and suggested to vacate. Totally 32 notices given to illegla constructions near karakatta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more