శుభవార్త... గ్యాస్ సిలిండర్‌పై రూ.300 రాయితీ
గ్యాస్ సిలిండర్ పై ప్రస్తుతం ఆయా కంపెనీలు ఇస్తున్న రాయితీ బ్యాంకు ఖాతాలో పడుతోంది. ఒకప్పుడు రూ.450 ఉన్న సిలిండర్ ను 2014లో నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేశారని చెప్పొచ్చు. మొత్తం సిలిండర్ ధర రూ.1200గా ఉంది.. ప్రజలకు రాయితీపై రూ.450కే వస్తోంది.. అదిపోను మిగతా రూ.750 నుంచి రూ.800 వరకు డబ్బులను బ్యాంకు ఖాతాలో వేస్తాం.. మీరు మాత్రం సిలిండర్ ను మొత్తం ధరతో కొనుగోలు చేయండి అంటూ నరేంద్రమోడీ చెప్పడంతో ప్రజలు నిజమే కాబోలు అనుకున్నారు.
క్రమేణా రాయితీని తగ్గించారు
ఆయన చెప్పినట్లుగానే అందరికీ బ్యాంకు ఖాతాల్లో రాయితీ సొమ్ము వేసుకుంటూ వచ్చారు. రూ.800గా ఉండే రాయితీ సొమ్మును చివరకు రూ.15 నుంచి రూ.20కు తీసుకువచ్చారు. బ్యాంకు ఖాతాల్లో ఈ రూ.15 పడుతున్నప్పటికీ వినియోగదారులు పూర్తిగా వాటిగురించి మర్చిపోయారు. గుజరాత్ వ్యాపారుల తెలివితేటలను ప్రధానమంత్రి చూపించారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అటువంటి పరిస్థితి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉజ్వల్ పథకంద్వారా ప్రజలకు సిలిండర్లు అందిస్తోంది.

మార్చి 31 వరకు వర్తిస్తుంది
ఉజ్వల్ కింద సిలిండర్ పొందుతున్నవారికి రూ.300 రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ రాయితీ ఆగస్టు నుంచి ఎనిమిది నెలలు కొనసాగనుంది. సాధారణ వినియోగదారులు పొందుతున్న ధరకంటే వీరికి రూ.300 తక్కువగా సిలిండర్ లభిస్తుంది. ఎన్నికలకు ముందు అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఉజ్వల్ కింద సిలిండర్లు పొందనివారికి రూ.300 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడోసారి అధికారంలోకి రావడంతో అప్పుడు ప్రకటించినదాన్ని ఎనిమిది నెలలు అమలు చేయబోతున్నారు. 2025 మార్చి 31వ తేదీ వరకు ఇది వర్తించనుంది. 2016లో ప్రారంభమైన ఈ పథకంలో












Click it and Unblock the Notifications