శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డంగా దొరికేసారు : ప‌చ్చ నేత‌ల సేవ‌లో ఖాకీలు: ఇసి..పోలీసు బాస్‌ల‌ను బేఖాత‌ర్‌..!

|
Google Oneindia TeluguNews

పోలీసు బాస్‌ల పై ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు క‌ల‌క‌లం రేపుతుంటే..ఇక్క‌డి పోలీసు సిబ్బందికి మాత్రం బేఖాత‌ర్ అం టున్నారు. అధికార పార్టీ నేత‌ల సేవ‌లో ఖాకీలు మునిగి తేలుతున్నారు. టిడిపి ప్ర‌చారంలో స్వ‌యంగా యూనిఫాం లో ఉన్న పోలీసు సిబ్బందే డ‌బ్బులు పంచుతూ అడ్డంగా దొరికి పోయారు. ఇప్పుడు ఈ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీని పై ఉన్న‌తాధికారులు ఏ ర‌కంగా రియాక్ట్ అవుతారో చూడాలి..

యూనిఫాం లో ఉండి..డ‌బ్బులు పంచుతూ

యూనిఫాం లో ఉండి..డ‌బ్బులు పంచుతూ

శ్రీకాకుళం జిల్లా ప‌లాస లో టిడిపి అభ్య‌ర్దులు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఆ ప్ర‌చారంలో పాల్గొన్న అభ్య‌ర్దుల కు మ‌ద్ద‌తుగా కార్య‌క‌ర్త‌లు వ‌చ్చారు. వారికి ప్ర‌చారం సాగుతున్న స‌మ‌యంలో స‌మీపంలో వైన్ షాపు వ‌ద్ద కార్యక‌ర్త‌లు మ‌ద్యం కొనుగోలు కోసం రాగా..వారికి యూనిఫాం లో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు ఇద్ద‌రు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు గా వీడియా లో స్ప‌ష్ట‌మైంది. వారు అక్క‌డికి వ‌చ్చిన వారికి డ‌బ్బులు పంచుతూ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. టిడిపి అభ్య‌ర్ది త‌ర‌పున వీరు కార్య‌క‌ర్త‌ల‌కు డ‌బ్బులు పంచుతున్న‌ట్లు అర్ద‌మ‌వుతోంది. ఇప్పుడు ఈ వీడియో హ‌ల్‌చ‌ల చేస్తోంది. దీని పై వైసిపి నేత లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌టానికి సిద్ద‌ప‌డ్డారు. వీడియో లో యూనిఫాం లో ఉన్న కానిస్టేబుళ్లు ఎవ‌రో స్ప ష్టంగా క‌నిపిస్తున్నారు. టిడిపి టీ ష‌ర్టులు వేసుకున్న కార్య‌క‌ర్త‌ల‌కు వీరు డ‌బ్బులు పంచుతూ దొరికి పోయారు. ఎన్నిక ల ప్ర‌చారం లో భాగంగా ఎటువంటి అల‌జ‌డులు జ‌ర‌గ‌కుండ బందో బ‌స్తు నిర్వ‌హించాల్సిన పోలీసులే ఇలా చేయ‌టం పై
విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి.

ప‌లాస అభ్య‌ర్దికి మ‌ద్ద‌తుగా..

ప‌లాస అభ్య‌ర్దికి మ‌ద్ద‌తుగా..

శ్రీకాకుళం నుండి ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి అభ్య‌ర్దిగా గౌతే శిరీషా బ‌రిలో ఉన్నారు. టిడిపి సీనియ‌ర్ నేత గౌతు శ్యం సుంద‌ర్ శివాజీ కుమార్తె శిరీష‌. అదే విధంగా శ్రీకాకుళం ఎంపి అభ్య‌ర్దిగా కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు ఉన్నారు. టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్ద‌కి మ‌ద్ద‌తుగా ఈ ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఒక వైన్ షాపు వ‌ద్ద కా ర్య‌క‌ర్త‌ల‌కు కావాల్సి విధంగా మ‌ద్యం కొనుగోలు చేయించే బాధ్య‌త ఆ ఇద్ద‌రు కానిస్టేబుళ్లు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.
వారి చేతికి డ‌బ్బులు ఇచ్చి..వారి ద్వారా కార్య‌క‌ర్త‌ల‌కు కావాల్సిన విధంగా స‌ర‌ఫ‌రా చేయిస్తున్న‌ట్లుగా వీడియో లో స్ప‌ష్ట మ‌వుతోంది. యూనిఫాం లో ఉండి...ఏ మాత్రం జంకు లేకుండా వారు డ‌బ్బులు పంచటం పై విస్తుపోవ‌టం సామాన్య జ‌నం వంతు అవుతోంది. అధికార పార్టీయే క‌దా అనుకున్నారో ఏమో..ఇంత‌గా బరి తెగించి వ్య‌వ‌హ‌రించ‌టం పై మాత్రం ఇప్పుడు పోలీసు ఉన్న‌తాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇసి..ప్ర‌భుత్వం మ‌ధ్య వార్ న‌డుస్తున్నా..

ఇసి..ప్ర‌భుత్వం మ‌ధ్య వార్ న‌డుస్తున్నా..

ఒక వైపు ఎన్నిక‌ల సంఘం ఫిర్యాదుల ఆధారంగా ఇంట‌లిజెన్స్ డిజి..రెండు జిల్లాల ఎస్పీల‌ను బ‌దిలీ చేస్తూ తీసుకు న్న నిర్ణ‌యం పై ఏపి ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. దీని పై కోర్టుకు వెళ్లింది. అయితే, హైకోర్టు మాత్రం ఎన్ని క‌ల సంఘం ఆదేశాల‌ను అమ‌లు చేయాల్సిందేన‌ని తీర్పులో స్ప‌ష్టం చేసింది. శ్రీకాకుళం ఎస్పీ పై ఆరోప‌ణ‌ల‌తో ఎన్ని క‌ల సంఘం వేటు వేసింది. ఆయ‌న స్థానంలో కొత్త ఎస్పీని నియ‌మించారు. స‌రిగ్గా కొత్త ఎస్పీ ఛార్జ్ తీసుకుంటున్న ఈ స‌మ‌యంలోనే జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం పై వీరి ధీమా ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది. ఈ వ్య‌వ‌హారం పై ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ గా రియాక్ట్ అవుతుంద‌ని చెబుతున్నారు. ఈ సాయంత్రానికి ఎన్నిక‌ల సంఘం ఈ ఇద్ద‌రు కానిస్టేబుళ్ల వ్య‌వ‌హారం పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

English summary
Two police persons distributing money in TDP election campaign in Palasa constituency in Srikakulam dist. Now this video halchal in media. Election commission may serious action against these two police persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X